Tuesday, April 23, 2024

మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలకు ఎవరు వెళ్లొద్దు: తెలంగాణ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Telangana Government

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రజలు ఎవరు ఆ రాష్ట్రాలకు వెళ్లోద్దని తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అటు వైపు వెళ్లొద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఆ రెండు రాష్ట్రాలకు తెలంగాణ సరిహద్దలున్న ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎపిలోని కర్నూల్ లో కరోనా బాధితులు సంఖ్య ఎక్కువగా ఉండడంతో గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లా వాసులు వెళ్లొద్దని అధికారులు సూచించారు. నల్లగొండ, ఖమ్మ జిల్లా వాసులు గుంటూరు, క్రిష్ణా జిల్లాలకు రాకపోకలు సాగించవద్దని పేర్కొంది. భారత్ దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 34,934కు చేరుకోగా 1157 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ 10,498మందికి సోకగా 459 మంది చనిపోయారు. ఎపిలో కరోనా రోగుల సంఖ్య 1403కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 33 లక్షలకు చేరుకోగా 2.34 లక్షల మంది చనిపోయారు.

రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు చికిత్స పొందుతున్నవారు కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
10,498 8,266 1,773 459
గుజరాత్ 4,395 3,568 613 214
ఢిల్లీ 3,515 2,362 1,094 59
మధ్య ప్రదేశ్
2,625 2,006 482 137
రాజస్థాన్ 2,615 1,654 900 61
తమిళనాడు 2,323 1,038 1,258 27
ఉత్తర ప్రదేశ్ 2,211 1,620 551 40
ఆంధ్రప్రదేశ్ 1,403 1,051 321 31
తెలంగాణ 1,038 568 442 28
పశ్చిమ బెంగాల్ 795 623 139 33
జమ్ముకశ్మీర్
614 390 216 8
కర్నాటక
565 314 229 22
కేరళ 498 111 383 4
పంజాబ్ 480 356 104 20
బిహార్ 425 339 84 2
హర్యానా 339 100 235 4
ఒడిశా 143 101 41 1
ఝార్ఖండ్ 110 88 19 3
ఛండీగఢ్ 74 56 18
ఉత్తరాఖండ్ 57 21 36
అస్సాం 43 13 29 1
ఛత్తీస్ గఢ్ 40 4 36
హిమాచల్ ప్రదేశ్ 40 7 28 2
అండమాన్ నికోబార్ దీవులు
33 17 16
లడఖ్ 22 5 17
మేఘాలయ 12 11 1
పుదుచ్చేరీ 8 3 5
గోవా
7 7
మణిపూర్ 2 2
త్రిపుర 2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరం 1 1
మొత్తం 34,934 24,693 9,081 1,157
Don’t go to Maharashtra-AP says Telangana govt
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News