Home తాజా వార్తలు తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయొద్దు: కెటిఆర్

తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయొద్దు: కెటిఆర్

KTR-and-Chandra-babu-naidu

హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్‌పై కెటిఆర్ స్పందించారు. సెంటిమెంట్ కోసమే తెలంగాణ ఇచ్చారన్న వ్యాఖ్యలను కెటిఆర్ తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పోరాటం చేసుకోండి… తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కానీ తెలంగాణ పోరాటాన్ని, ప్రజల త్యాగాలను తక్కువ చేయొద్దని బాబును మందలించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై తాము ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. ఎవరు ఎంత ప్రలోభపెట్టినా ప్యాకేజీలను తాము అంగీకరించలేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు.