Home మహబూబాబాద్ డబుల్ నిర్మాణాలు వేగవంతం చేయాలి

డబుల్ నిర్మాణాలు వేగవంతం చేయాలి

 Double Bed room structures should be accelerated

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో రెండు పడకల గదుల నిర్మాణాల పురోగతిని నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు 3890 డబుల్ బెడ్‌రూం ఇండ్లు మంజూరు కాగా 3640 గృహాలకు టెండర్లు పిలిచి 1542 టెండర్ల ప్రక్రియ పూర్తయి 1366 గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, 166 ఇండ్లు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. పెండింగ్ టెండర్లు ప్రక్రియ ఈనెల చివరినాటికి పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్ నియోజకవర్గానికి 4075 గృహాలు మంజూరుకాగా 975 టెండర్లు పిలిచి 350 టెండర్లు ప్రక్రియ పూర్తయి 280 ఇండ్లు నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మిగిలిన వాటిని వెంటనే చేపట్టాలని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఆర్‌అండ్‌బి ఇఇని కలెక్టర్ ఆదేశించారు. అలాగే డోర్నకల్ నియోజకవర్గానికి 1409 ఇండ్లు మంజూరు కాగా టెండర్లు 1409 పిలిచారని, వాటిలో 370పూర్తయ్యాయని, 370 ఇండ్లు ప్రారంభించి 64 ఇండ్లు పూర్తయ్యాయని మిగిలినవి వెంటనే టెండర్లు చేపట్టాలని ట్రైబల్ వెల్ఫేర ఇఇని ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గలోని పెద్దవంగర, తొర్రూరు మండలాలకు 655 ఇండ్లు నిర్మాణ పనులు మొదలై మిగిలిన టెండర్లు ప్రక్రియ 15రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంల్లందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలకు 330 ఇండ్లు మంజూరు కాగా 160 ఇండ్లు టెండర్లు పూర్తయి 160 నిర్మాణాలు ప్రారంభమై 60 పూర్తయ్యాయని, మిగిలిన వాటికి టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఇండ్ల నిర్మాణాలను మొదలు పెట్టాలని ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ భద్రాచలంను ఆదేశించారు. అలాగే ములుగు నియోజకవర్గలోని కొత్తగూడ, పెనుగొండలకు 44ఇండ్లు మంజూరుకాగా 44 టెండర్ల ప్రక్రియ పూర్తయి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. స్థల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సంబంధిత తహసీల్దార్లలో మాట్లాడి పరిష్కరించి నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ద వహించి అన్ని గృహాలు దసరా నాటికి పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జెసి దామోదర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఇఇ రాజేంద్రనాయక్, ఇరిగేషన్ ఇఇ జగదీశ్వర్ తదితరులునారు.