Search
Friday 21 September 2018
  • :
  • :

సిఎం సొంత నియోజకవర్గంలోనే డబుల్ ఇళ్లు : జీవన్‌రెడ్డి

Jeevan-reddy1

ధర్మపురి: పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టిఆర్ ఎస్ ప్రజలను మోసం చేసిందని సిఎల్‌పి ఉపనేత, ఎంఎల్‌ఎ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల్లు ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజక వర్గంలో మినహా ఎక్కడ కన్పించడం లేదని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని నేరెల్ల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. దళితుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌కు 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 15వేల కోట్లు నిధులు కెటాయించారని తెలిపారు. అందులో కేవలం 7వేల కోట్ల నిధులు మాత్రమే ఖర్చు చేశారని ఆయన వివరించారు. మిగిలిన 8వేల కోట్ల నిధులు రధ్దయ్యాయని, దాని వల్ల ఎస్‌సి, ఎస్‌టిలకు అన్యాయం జరిగిందని వివరించారు. రద్దయిన రూ. 8వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులతో రాష్ట్రం లో 1లక్షా 60వేల ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించ వస్తుండేనని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాం లో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం కోసం చట్ట బద్దత కల్పించామన్నారు. స్వయం ఉపాధి పథకం రూ. 500 కోట్లు బకాయిలు ఉండగా అసెంబ్లీ సమావేశాల్లో తాను మాట్లాడితే మార్చి నెలాఖరులో గా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

Comments

comments