Home తాజా వార్తలు పేదల ఆత్మగౌరవానికే ‘డబుల్’ ఇళ్లు

పేదల ఆత్మగౌరవానికే ‘డబుల్’ ఇళ్లు

 Double Bedroom House as Gift to Poor people

మన తెలంగాణ/నిర్మల్‌రూరల్: పేదలు సమాజంలో ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ధ్యేయంతో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్లు నిర్మాణాలను చేప ట్టడం జరిగిందని రాష్ట్ర గృహనిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం సోన్ మండలంలోని కూచన్‌పెల్లి గ్రామంలో రూ.151.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న 30 రెండు పడకల గదుల భవనాలకు భూమి పూజ చేశారు.ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లా డుతూ దేశంలో ఏరాష్ట్రంలో చేపట్టని విధంగా పేదలు సమాజంలో ఆత్మగౌరవంతో బ్రతకాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండు పడకల గదుల భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర  ప్రభు త్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రూ. 40వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరందించే పథకం చేపట్టినట్లు మన జిల్లాలో ఈ పథ కం 15 రోజుల్లో పూర్తి కానున్నట్లు తెలిపారు.పేదలకు ఆసరా ఫించ న్లు, ప్రతీ వ్యక్తికి ఆహారభద్రత కార్డు ద్వారా 6 కిలోల బియ్యం, రైతులకు 24 గంటల ఉచితకరెంట్,ఎకరానికి రూ.4వేలు అంది స్తున్నట్లు పేర్కొన్నారు.కస్తూర్బాగాంధీ విద్యాలయాల వల్ల ఆడపిల్లలకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. షాదీమూభారక్, కళ్యాణలక్ష్మిపథకంద్వారా రూ.1లక్ష116లను అందిస్తున్నట్లు పేర్కొ న్నారు. అలాగే ప్రభు త్వ ఆసుపత్రిల్లో ప్రసావం జరిగితే కేసిఆర్ కిట్,ఆడపిల్ల పుడితే రూ.13వేలు,మగపిల్లడు పుడితే రూ.12 వేలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ సందర్బంగా కూచన్‌పెల్లి గ్రామానికి ఇంకా అదనంగా 25 డబుల్ బెడ్ ఇళ్ళు మంజూరీచేస్తున్న ట్లు తెలిపారు.నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్‌రామ్‌రెడ్డి,ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పి ఎసిఎస్ చైర్మన్ జీవన్‌రెడ్డి,జెడ్‌పిటిసి రమేష్,ఆత్మచైర్మన్ నర్స రెడ్డి,టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, సర్పంచ్ లింగన్న,మురళీధర్ రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, సుదర్శన్, ఎంపిటిసిలు పాల్గొన్నారు.