Home తాజా వార్తలు ఆత్మగౌరవ లొగిళ్లు

ఆత్మగౌరవ లొగిళ్లు

Double bedroom houses are self-evident symbols of the poor

డబుల్ బెడ్ ఇళ్లు పేదల ఆత్మాభిమాన ప్రతీకలు
దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి
రామచంద్రాపురం కొల్లూరులో నిర్మాణంలోని ఇళ్ల తనిఖీలో మంత్రి కెటిఆర్ 

మన తెలంగాణ/ హైదరాబాద్ : పేదలు ఆత్మాభిమానంతో జీవించేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దోహదపడుతాయని మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు అన్నారు. దేశంలోనే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాయన్నారు. శనివారం రామచంద్రాపురం కొల్లూరులో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంత్రి కెటిఆర్, హైదరాబాద్ నగరమేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇళ్ల నిర్మాణ పనుల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశా రు. నిర్మాణ సమయంలో కార్మికుల భద్రతకు సం బంధించిన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాల న్నా రు. ఇళ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని, టీం వర్క్‌తో పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

సాంకేతిక సలహాలందిస్తున్న జె.ఎన్.టి. యు అధ్యాపకులు, సైట్ ఇంజినీర్లతో జరుగుతున్న పనులను మంత్రి సమీక్షించారు. కొల్లూరు కాలనీని దేశంలోనే ఆదర్శవంతమైన కాలనీగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి స్థాయిలో మౌలికసౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు నిర్ధిష్ట సమయాన్ని నిర్దేశించుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఒకేచోట 124 ఎకరాల్లో 15,660 ఇళ్ల ను నిర్మించిన దాఖలాలు లేవని, ఇం తటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా చేపట్టి న కొల్లూరును మోడల్ సిటీగా రూపొందించనున్నట్లు ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఇక్కడ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇక్కడ నిర్మిస్తున్న ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయ న్నారు.

రాబోయే కాలంలో సుమారు 70వేల పై చిలుకు జనాభా ఇక్కడ నివాసం ఉంటుందన్నారు. గృహా సముదాయాల్లో వాణిజ్య సముదాయం నిర్మించి, దానిపై వచ్చే ఆదాయం ద్వారా లిప్ట్, ఇతర నిర్వహణ ఖర్చులకు ఉపయోగపడేలా వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. మురుగునీటి జలాల శుద్ధి కోసం సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఆధునిక మురుగునీటి వ్యవస్థను గృహ సముదాయంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కొల్లూరు టౌన్షిప్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతిరోజు మూడు షిప్టుల్లో సుమారు 3,500 మంది కార్మికులు 400 మంది సిబ్బంది 24 గంటలు నిరంతరం పని కొనసాగిస్తున్నారని తెలిపారు. పనులను నిరంతరం పర్యవేక్షించడానికి సిసిటివి కెమెరాలను అమర్చి పనులు పరిశీలిస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుటుందని మంత్రి అధికారులకు సూచించారు. జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు తెలిపారు.

ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్‌గా కొల్లూరు
గృహ సముదాయాల్లో సకల సౌకర్యాలు 124 ఎకరాల్లో ఒకే చోట రూ.1354.59 కోట్ల అంచనా వ్యయంతో 15,660 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను జిహెచ్‌ఎంసి నిర్మిస్తోంది. ఒక్కో ఇంటికి రూ.7.90 లక్షల వ్యయం, మరో రూ.75 వేలు మౌలిక సౌకర్యాల కల్పనకు వ్యయం చేస్తున్నారు. చిన్పపాటి నగరాన్ని రూపొందించే ఈ మెగా డబుల్‌బెడ్‌రూం సిటీ నిర్మాణాన్ని రామచంద్రాపురంలోని కొల్లూ రు గ్రామంలో నిర్మిస్తోంది. మొత్తం నిరుపేద లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వనున్నారు. మొత్తం 117 హౌజింగ్ బ్లాకుల్లో ఎస్ + 9, ఎస్ + 10, ఎస్ + 11 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ కాలనీని దేశంలోనే ఆదర్శవంతమైన, మరెక్కడా లేని విధంగా అన్ని సౌకర్యాలతో నిర్మించడం ద్వారా మోడల్ సిటీగా రూపుదిద్దుకొనుంది. అంతర్గత సిసిరోడ్లు, వర్షపు నీటి డ్రెయిన్ల నిర్మాణం. తాగునీటి సరఫరా, అంతర్గత డ్రైనేజీతో పాటు సీవరేజ్ ప్లాంట్(ఎస్.టి.పి) నిర్మాణం.
1 వీధి దీపాలు ఏర్పాటు.
2 ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు.
3 కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం.
కమ్యూనిటీ కాంప్లెక్స్
4 పాఠశాల, అంగన్‌వాడి కేంద్రాల ఏర్పాటు.
5 బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు.
6 షేర్‌వాల్ సాంకేతిక విధానంలో నిర్మాణం. మొత్తం 15,660 డబుల్‌బెడ్‌రూంలు కలిపి, 96,75,100 చదరపు అడుగుల విస్తీర్ణం.