Home అంతర్జాతీయ వార్తలు సిరియాలో కారు బాంబు పేలుళ్లు: 46 మంది మృతి

సిరియాలో కారు బాంబు పేలుళ్లు: 46 మంది మృతి

Car-bomb-attackబీరూట్: సిరియాలోని హోమ్స్ నగరంలో జంట కారు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 46 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరి కొందరికి గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులేనని అధికారులు తెలిపారు.