Search
Sunday 18 November 2018
  • :
  • :

అర్హులందరికీ డబుల్ ఇండ్లు

Double homes for all eligible in Medak District

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం చేసుకున్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికే ఇళ్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి అన్నారు. మంగళవారం 4వ వార్డులోని ఎంసిహెచ్‌లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో  కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో దేశంలోనే ఇలాంటి ఇండ్లు ఎక్కడ కట్టలేదని కలెక్టర్ అన్నారు.  సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించిన సమగ్ర వివరాలున్నాయని తెలిపారు. అర్హత ఉన్న వారికే ఇండ్లు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తరువాత మూడు వారాలలో అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి విచారణ చేస్తారన్నారు. ఎక్కడ ప్రలోభాలకు లోను కావద్దని డబుల్ బెడ్‌రూం ఇండ్లు అర్హత కలిగిన పేద వారికే కేటాయిస్తామన్నారు. ఇండ్ల విషయాలలో ఎవరైనా  డబ్బు ఇచ్చినట్లు తెలిస్తే ఇచ్చిన వారికి, తీసుకున్నవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. తప్పుడు సమాచారంతో దరఖాస్తు  చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాలుగో వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments