Search
Tuesday 20 November 2018
  • :
  • :

టెక్స్‌టైల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెట్టింపు

Double tariff import on textile products

328 వస్తువులపై 20 శాతం పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయ వస్త్ర ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దాదాపు 328 వస్త్ర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేసింది. అంటే 20 శాతం మేరకు సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో తయారయ్యే వస్త్ర ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ నోటిఫికేషన్ ప్రవేశపెట్టారు.

328 రకాల వస్త్ర ఉత్పత్తులపై 20 శాతం పన్ను విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. దిగుమతి చేసుకునే వస్త్ర ఉత్పత్తులపై ప్రస్తుతం పన్ను తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కస్టమ్స్ యాక్ట్ 1962 సెక్షన్ 159 కింద 10 శాతం నుంచి 20 శాతానికి సుంకం పెంచినట్టు తెలిపారు. తద్వారా దేశీయ తయారీదారులకు మంచి ప్రోత్సాహం లభించడంతోపాటు, ఈ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. అయితే దిగుమతి చేసుకున్న వస్త్రాల ధరలు ఇక భారీగా పెరగనున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం ఎక్కువగా చైనా ఉత్పత్తులపైనే ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా గత నెలలో ప్రభుత్వం 50 రకాల వస్త్రాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం రెండింతలు చేసింది. జాకెట్లు, సూట్లు, కార్పెట్లపై 20 శాతం దిగుమతి సుంకం విధించింది.

Comments

comments