Home ఎడిటోరియల్ దళిత వర్గాల వైతాళికుడు డా॥బి.ఆర్. అంబేద్కర్

దళిత వర్గాల వైతాళికుడు డా॥బి.ఆర్. అంబేద్కర్

Ambedkar1భారత రాజ్యాంగ రూపశిల్పిగా, బహు ముఖ ప్రజ్ఞాశాలిగా దళిత వర్గాల వైతాళికుడుగా నీరాజనాలందుకున్న భారతరత్న డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఇరవయ్యో శతాబ్దంలో చిరస్మర ణీయులైన మహాపురుషులలో ఒకరు. తరతరా లుగా సమాజంలో సమాన స్థానం లభించక సామాజికంగా అనేక వ్యధలకు గురి అవుతున్న వర్గాల అభివృద్ధికి జీవితకాలం కృషి చేసి అస్పృశ్యుల ఆరాధ్య దైవంగా డా.అంబేద్కర్ గుర్తింపు పొందారు. డా.అంబేద్కర్ హిందూ వర్ణాశ్రమ వ్యవస్థపై ధ్వజమెత్తారు. శూద్రులను, అస్పృశ్యులను అణగద్రొక్కడానికి ప్రయత్నించిన హిందూ కుల వ్యవస్థ విధానాన్ని నిశితంగా విమర్శించి, అస్పృశ్యతా నివారణకు రాజ్యాంగ బద్ధంగా పోరాడారు. జాతీయ నాయకుడు అంబేద్కర్ సమకాలీన రాజకీయ సంగ్రామంలో ఎన్నో విమర్శలకు గురైనా, ఆధునిక భారత ప్రజా స్వామ్యం ఆయనను అఖండ దేశభక్తునిగా, సామాజిక విప్లవ కర్తగా పరిగణించింది. సామా జిక అస్పృశ్యతకు అన్యాయానికి గురైన అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని ‘మౌ’ అనే గ్రామంలో కీ.శ. 1891వ సం॥ ఏప్రిల్ 14న జన్మించాడు. ఆయన తండ్రి రామ్ జీ మీలోజీనంపాల్ షెడ్యూ ల్డు కులమైన మహర్ కులానికి చెందిన వారు. నిజానికి మహర్‌లు మంచి యోధులుగా, ధీరులుగా చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందారు. ఈ నాటికి మన సైన్యంలో మహర్ రెజిమెంట్ పేరుతో ఒక సైనిక విభాగం ఉన్నది.
అంబేద్కర్ మేథాశక్తి:
బాల్యావస్థలో జీవితంలో ఎదురైన అవధుల్ని, అవరోధాలను, అన్యాయాలను అధిగమించి ఒక సంపూర్ణ వ్యక్తిగా అంబేద్కర్ రూపొందారు. భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలోని అసమానతలను రూపుమాపి, భారతీయ సమా జాన్ని తీర్చిదిద్దాలని ఆయన భావించారు. అంబేద్కర్ రచనల ప్రధాన లక్షం దళిత జాతుల ప్రగతి, అభివృద్ధి, వికాసం; బహుముఖ సాంస్కృ తిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ వికాసాన్ని సాధించడమే. ఇతని రచనలు శాస్త్రవేత్తల మన్నన లు పొందడమే కాకుండా కొత్త ఆలోచన లను రేకెత్తించాయి. బ్రిటీషు పరిపాలనలో కేంద్ర శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు అంబేద్కర్ ఆలోచనా సరళి రచనలు పరిశీలనా గ్రంథంగా ఉపయోగపడ్డాయి. అంబేద్కర్ రచన ల్లో ఫలిస్తున్న ఆలోచనలుభారతదేశంలోని సామా జిక ఆలోచన చరిత్ర క్రమాన్ని, పెరుగు దలను గ్రహించడంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించు కున్నాయి. మారుతున్న పరిస్థితుల దృష్టా సామా జిక, ఆర్థిక, రాజకీయ విషయా లలో అంబేద్కర్ అభిప్రాయాలు వాస్తవమవుతూ వచ్చాయి. కుల సంఘర్షణలు పెరుగుతున్న నేటి సమాజానికి ఆయన ఆలోచనా సరళి, రాజనీతి తత్వవిచారం ఎక్కువ సందర్భోచితంగా ఉన్నా యి. బలహీన వర్గాల్లో చైతన్యాన్ని రగిలించి వారికి నాయకత్వం వహించి డా॥అంబేద్కర్ తన రాజకీయ మహా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యత్వం రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం ఆయన కృషికి ఎంతగానో దోహదం చేశాయి. అంబేద్కర్ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని మాత్రం విడనాడలేదు. ఆయన రచనలు, చేసిన ప్రసంగాలు అంబేద్కర్ జ్ఞానసంపదకు మణిహారాలు.
మేధావుల ప్రభావం:
ఆధునిక విద్యా పారంగతుడైన అంబేద్కర్‌లో ఫ్రెంచి విప్లవ ఫలితాలు, అమెరికా స్వాతంత్య్ర పోరాటం స్వేచ్ఛా స్వాతంత్య్రం, సోదర భావా లను పెంపొందించాయి. రూసో, వాల్టర్ లీప్ మాన్, బెర్నార్డ్ షా వంటి మేధావుల రచనలు కూడా అంబేద్కర్‌ను ప్రగతి కాముకునిగా తీర్చి దిద్దాయి. పీడిత వర్గాలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ పురోభివృద్ధికి సమానావకాశాలు లభిం చాలని, స్త్రీలకు, శూద్రులకు నిర్బంధ విద్యను సమకూర్చాలని ప్రబోధించిన ‘జోతిబా ఫూలే ’తాత్విక విచారంకూడా ఆయనను ప్రభావితం చేశాయి.
ప్రపంచాన్ని ఆధునిక వైజ్ఞానిక, సాంకే తిక దృక్పథం వైపు మార్చడంలో విద్యకు గల పాత్రను జాన్ డేవిడ్ ప్రభావ ఫలితంగా గ్రహిం చారు. భారత సమాజంలో జరుగుతున్న ఆర్థిక సంబంధ మైన దోపిడిని గుర్తించడంలో కార్ల్ మార్క్ విశ్లేషణా ప్రభావానికి ఆయన లోనైనారు. బుద్ధుని బోధనలు అంబేద్కర్ మనస్సులో చెరగని ముద్ర వేశాయి.
అంబేద్కర్ రచనల ప్రభావంః
దళిత వర్గ సముద్ధరణ కోషమే అంబేద్కర్ అనేక వాసాలూ, గ్రంథాలు రచించారు. అమెరికా లో ఉన్నప్పుడు భారతదేశంలో కుల, మత వ్యవస్థ గురించి Caste in India – Their Genesis అనే పరిశోధనా వ్యాసాన్ని రచించాడు. ఈ వ్యాసాన్ని డాక్టర్ గోల్డెన్ విజేర్ ఆంథ్రోపాలజీ సెమినార్‌లో చదివారు. కులవ్యవస్థ సమస్యను అంబేద్కర్ ఆంథ్రోపాలజీ దృక్పథంతోనే విశ్లే షిం చారు. భారత దేశం లోని జనాభా ఆర్య, ద్రావిడుల, మంగో లియన్‌ల సమ్మేళన మని సూచించా రు. 1919లో ఎన్నికల సంస్కరణ సంఘం ముందు దళి త వర్గాల కు రాజకీయ హక్కులు ఉండాలని వాదిం చా రు. 1920లో ‘మూక్ నాయక్’ అనే మరాఠీ పక్ష పత్రికను, 1924 లో బహిష్కృత హిత కారిణి సభను ప్రారం భించి అంబేద్కర్ అస్పృశ్యుల నైతిక, సాంఘిక ప్రగతికి మార్గ దర్శిగా నిలిచారు. నిమ్నజాతుల నుద్దరించి, ఇతరులతో సమానమైన స్థాయిని కల్పించాలనే ఉద్దేశ్యం తోనే ఈ సభను బొంబాయిలో ఏర్పాటు చేశారు. అంబేద్కర్ మారు తున్న పరిస్థితుల దృష్టా తన ఆలోచనా సరళిని, రచనలనూ మార్చుకున్నారు. 1927లో ‘బహిష్కృతి భారత్’ అనే పక్ష పత్రికను, అస్పృశ్యులకు, హిందువులకు మధ్య సాంఘిక సమానత్వాన్ని ప్రబోధించడం కోసం ‘సమాజ జనతా సంఘ్’అనే సంస్థను ఆయ న స్థాపించారు. 1929లో జన్ సమతా, 1930 లో జనతా అనే పత్రికలను ఆయన నడి పారు. 1946లో అస్పృశ్యులపై ప్రత్యేకగ్రంథాన్ని రచిం చారు.
హిందూ కులతత్వంపై విప్లవం:
అంబేద్కర్ భారతదేశంలో కుల వ్యవస్థను గురించి రాసిన గ్రంథం ద్వారా హిందూ వర్ణా శ్రమ వ్యవస్థలోని కుల వ్యవస్థ నిర్మూలనకు గట్టి పునాదులు వేశారు. ఒకే మానవ సమాజంలో కుల, మత, వర్ణ విభేదాలు మానవ జాతికి అవమానకరమని భావించారు. ఆధు నిక విద్యా పారం గతుడైన అంబేద్కర్ కుల వ్యవస్థను నిశితంగా విమ ర్శించిన మొద టి సంఘ సంస్కర్త గా భారతీయుల మనోపథంలో చెర గని స్థానాన్ని సంపాదించుకు న్నారు. కుల తత్వం పోరాటం లో ఆయన ఎన్నో అవ మానాలను ఎదు ర్కొన్నారు. ఇందు కు కారణం హిందూ సమాజం లో అస్పృశ్యు లు గా పరిగణించ బడి న మహార్ కుటుం బంలో జన్మించ డమే. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే విధా నానికి వ్యతి రేకంగా ఉద్య మించి, నూతన మహాభ్యుద య శక నిర్మాణానికి అంబే ద్కర్ నడుంకట్టా రు. హిందూమతంలోని వర్ణ విభజన ఆయనను ఎంతగానో కదిలించింది. కులాల పేరుతో మనుషులను విభజించి, హింసించే పద్ధతిని ఆయన నిరసించారు.
కుల నిర్మూలనః
భారతదేశంలో సంపన్న హిందు వులలోని సంస్కర్త లు, ఎందరో విజ్ఞాన వంతులు కులాలను రద్దు చేయవలసిన ఆవశ్యకతను గుర్తించలేదు. కుల వ్యవస్థకు వ్యతిరేకం గా ఆందోళన జరిపే ధైర్యం హిందూ సంస్కర్త లలో లేకుండా పోయిం దని అంబేద్కర్ విమర్శించాడు. అంబేద్కర్ అభిప్రాయంలో భారతదేశంలో రాజకీయ విప్లవాలకంటే ముందు సాంఘిక, మతపరమైన సంఘర్షణలు జరిగే బ్రిటీష్ పాలనా కాలంలో సంఘ సంస్కరణ కంటే రాజకీయ స్వాతంత్య్రం ఎక్కువ ప్రాధాన్యతను సంతరించు కున్నది. అంబేద్కర్ అభిప్రాయంలో కులం, శ్రమ విభజన మీద ఆధారపడలేదని, అది శ్రామికుల విభజన అని స్పష్టంగా చెప్పాడు. సామాజిక ఐకమత్యానికి అడ్డుగా నిలుస్తున్న కులాలనుంచి ప్రజాస్వామ్య సూత్రానికి అనువుగా ఉండేలాగా స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి సిద్ధాంతా లపై ఆధారపడే నూతన సమాజాన్ని నిర్మించ వలసిం దిగా ఆయన హిందువులకు పిలుపు నిచ్చాడు. కుల వ్యవస్థ దుర్మార్గపు ఆచారాల మీద కాకుండా, హేతువు మీద సమాజం ఆధార పడా లని ఆయన సూచించారు. కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే వర్ణాంతర వివాహ మొక్కటే దివ్యమైన మార్గమని అంబేద్కర్ అభిప్రాయపడ్డాడు. కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ ప్రజలలో చైతన్య బీజాలను నాటడంలో అంబేద్కర్ ప్రముఖపాత్ర వహిస్తూ దళిత వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచాడు.
సామాజిక విప్లవవాది:
1920లో నాగపూర్‌లో దళిత మహాసభలో ప్రారంభమైన ఉద్యమాలు, ‘మహర్’ చెరువులో హరిజనులు మంచినీరు తాగడానికి నడిపిన ఉద్యమం, నాసిక్ దేవాలయ ప్రవేశానికి చేసిన పోరాటం, 1924 జులై 20న ఏర్పాటు చేసిన ‘బహిష్కృత హితకారిణి సభ’, సైమన్ కమీషన్ ముందు నిమ్నజాతుల కోసం ప్రత్యేక నియోజక వర్గాలు కావాలనే డిమాండ్, లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో హరిజను లకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని జరిపిన కృషి, కార్మిక నాయకుడిగా, లేబర్ పార్టీ స్థాపకుడుగా శాసనసభలో ఆయన చేసిన పోరా టాలు చిరస్మరణీయం. అంబేద్కర్ చేపట్టిన ఉద్యమం సమాజంలోని అనాచారాలను సమూ లంగా నిర్మూలించకపోయినా వికృత కులవ్యవస్థ లోని కుళ్ళును ప్రజలకు తేటతెల్లం చేసింది. కుల వ్యవస్థపై అంబేద్కర్ సహేతుక దాడి గాంధీజీని సైతం ఆకట్టుకుని, అస్పృశ్యతా నివారణ పోరాటం ఆయన జీవితాంతం జరిపేం దుకు ప్రేరణ నిచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. 1933 లో గాంధీజీ హరిజన్ పత్రికలో అంబేద్కర్ పై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తనమే ఇందుకు తార్కాణం. గాంధీజీ తన అభిప్రాయాన్ని తెలుపుతూ ‘అంబేద్కర్ మనస్సు లో క్రోధం ఉంది. ఆ క్రోధం సహేతుకమైంది. విదేశాలలో ఆయన పట్ల ఎంతో గౌరవం, ఆప్యా యత వ్యక్తమవుతూ ఉంటాయి కాని, స్వదేశంలో హిందువులు హిందూ సమాజంలో ఫలానా కులానికి చెందిన వాడంటూ అంబేద్కర్ ను అడుగడుగున వేలెత్తి చూపుకుంటా’రని అన్నారు.
నిమ్న వర్గాల పరిరక్షణ ప్రతినిధిః
స్వతంత్ర భారతదేశం రిపబ్లిక్‌గా అవతరిం చడంలో దోహదం చేసిన రాజ్యాంగ నిర్మాతలలో డా.అంబేద్కర్ ప్రముఖులు. స్వయంగా జీవితం లో ఎదుర్కొన్న సామాజిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని, రాజ్యాంగ రచనా సభలో ముసాయిదా సంఘ అధ్యక్షుడిగా తరతరాలుగా వస్తున్న అసమానతలను రూపుమాపి, భారత పౌరులంద రికి రాజ్యాంగ పరంగా సమానత్వం కల్పించాల్సి న అవసరాన్ని నొక్కి చెప్పాడు. సమాజంలో అట్టడుగున మగ్గుతున్న వర్గాల ప్రజలను గుర్తించి, వారి అభివృద్ధికి సామాజికంగా సముచిత స్థానాన్ని పొందేందుకు అవసరమైన రాజ్యాంగ పరిరక్షణలు కల్పించడంలో అంబేద్కర్ కీలక భూమిక నిర్వర్తించారు.
భారత రాజ్యాంగం ద్వారా దళితులకు ఆర్థిక, రాజకీయ పరమైన హక్కులను సంక్ర మింపజేయడంలో అంబేద్కర్ కృషి మూలంగానే నేడు దళితులు రాజ్యాంగపరమైన ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నారు. ఈ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అతి నికృష్టమైన సామాజిక దురన్యాయం అంటరానితనం. దీన్ని రూపు మాపేందుకు ఒక శతాబ్దకాలం నుండి సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ చట్టపరంగా దీన్ని రద్దు చేసి ఆచరించడం రాజ్యాంగంలోని 17వ నిబంధన ప్రకారం నేరమని రూపకల్పన చేయడంలో అంబేద్కర్ పాత్ర విశిష్టమైంది.
హిందూ కోడ్ బిల్లు ద్వారా భారతీయ మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగు పరచ డానికి కీలకపాత్ర వహించారు. భారతరత్న మరణానంతరం లభించినా అంబేద్కర్ తను జీవించి ఉండగానే జాతిరత్నంగా ప్రసిద్ధి చెందాడు.
రచయితః రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్ మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ (రిటైర్డ్) గా పనిచేశారు. వికారాబాద్, రంగారెడ్డిజిల్లా,
email:hddnathvkb@gmail.com