Search
Sunday 18 November 2018
  • :
  • :

గౌతమి పుత్ర శాతకర్ణి లో డ్రీమ్ గర్ల్ హేమా మాలిని

hemamaliniasbalasri

ఒకప్పుడు బాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన డ్రీమ్ గర్ల్ హేమా మాలిని గుర్తుండే ఉంటుంది. అయితే, హేమా మాలిని టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి లో నటిస్తోంది. గౌతమి పుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ గా ఆమె నటిస్తోందట. దానికి సంబంధించిన స్టిల్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

వేదం క్రిష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బాలకృష్ణ కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది మూవీ యూనిట్. తెలుగు అభిమానులకు అవి తెగ నచ్చేయడం తో ఇంకో ముందడుగేసి హేమా మాలిని పోస్టర్ ను రిలీజ్ చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12, 2017 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్.

Comments

comments