Home తాజా వార్తలు నీరులేక ఎండిన ప్రధాన చెరువులు

నీరులేక ఎండిన ప్రధాన చెరువులు

Ponds షాబాద్ (రంగారెడ్డి) : షాబాద్ మండలంలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన చెరువుల్లో నీరులేక ఎండిపోయాయి. దీంతో సాగు, తాగునీటి బావులో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. తాగునీటి కోసం పల్లె ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తాగునీటి బావుల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోవాడంతో ఇంటి అవసరాలకే ఆ నీటిని ఉపయోగిస్తున్నారు. తాగడానికి మినరల్ వాటర్ కంపెనీలపై ప్రజలు ఆధారపడుతున్నారు. తీంతో గ్రామాల్లో మినరల్ వాటర్‌కు బాగా గిరాకీ పెరిగింది. ఇదిలా ఉంటే మూగ జీవాల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రతి గ్రామంలో బర్రెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూగజీవులకు తాగునీరు చెరువులే ఆధారం. కానీ గత 15 రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల గ్రామీణ చెరువులు పూర్తిగా ఎండిపోవడంతో మూగ జీవాలకు నీరు లభించక తల్లడిల్లుతున్నాయి. మండలంలో షాబాద్, చందన్‌వెళ్లి, మాచన్‌పల్లి, నాగర్‌కుంట, తదితర చెరువులు ఎండిపోయాయి. మూగ జీవాలకు నీరు లభించక కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొళాయిలో నీరు నింపి మూగజీవాల దాహాం తీరుస్తున్నారు. మండలంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో కొళాయిలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నీరు నింపాలని ఆయా గ్రామాల ప్రజలు కొరుతున్నారు.

Dried Ponds In Shabad Mandal At Rangareddy