Home రంగారెడ్డి సారూ … ఆదుకోండి

సారూ … ఆదుకోండి

నేడు కరువు బృందం పర్యటన
ఇబ్రహీంపట్నం, శివసాగర్, గండిపేట చెరువుల పరిశీలన
కేశారం, రంగాపూర్‌లో రైతులతో ఇష్టాగోష్టి
ఏర్పాట్లపై సమీక్షించిన జెసి
ఎండిన చెరువులను, నాశనమైన పంటలను పరిశీలించి ఆదుకోవడానికి జిల్లాలో నేడు కేంద్ర బృందం పర్యటించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.జిల్లాలోని శివారులో ఉన్న మూడు మండలాలు మినహా పూర్తిగా కరువు జిల్లాగా ప్రకటించి సహాయం చేయాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించిన విషయం తెలిసిందే. కేంద్ర బృందం జిల్లాలోని గ్రామ స్థాయిలో పర్యటించి కరువు పరిస్థితులతో పాటు రైతులు పడుతున్న ఇబ్బందులు, భవిష్యత్‌లో కలుగు సమస్యలపై కూడా నివేదికలను తయారుచేస్తోంది. వరణుడు కరుణించక పోవడంతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి. వేలాది ఎకరాల ఆయకట్టు ఉన్న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు, హైద్రాబాద్ మహానగరానికి తాగు నీరు అందించే గండిపేట జలాశయం, వికారాబాద్ శివసాగర్‌లను వారు పరిశీలన చేయనున్నారు.
JCమన తెలంగాణ/రంగారెడ్డి : జిల్లాలో పత్తి రైతులు ఖరీఫ్‌లో వర్షాలు లేక చాలా వరకు నష్టపోవడంతో పాటు ఆత్మహత్యలను సైతం చెసుకున్నారు. చెవెళ్ల మండలం కేసారం, పూడూర్ మండ లం రంగాపూర్‌లో ఎండిన పత్తి పంటను పరిశీలించడంతో పాటు రైతులతో ఇష్టాగోష్టి కూడ నిర్వహించి వారి కష్టాలను తెలుసుకోనున్నారు. జిల్లాలో వర్షా లు లేక మూగ జీవులు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పశుగ్రాసం కొరతతో పాటు పశువులకు తాగడానికి నీరు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.
నివేదికలు సిద్ధం …
జిల్లాలో ఎర్పడిన తీవ్ర దుర్బిక్ష పరిస్దీతులపై జిల్లా యంత్రాంగం శాఖల వారిగా నివేదికలను తయారు చెసింది. వ్యవసాయ శాఖ, పశు సంవర్దన శాఖ, ఆర్‌డబ్లుఎస్, ఇరిగేషన్ శాఖలతో పాటు ఇతర శాఖలు పూర్తి స్దాయిలో జరిగిన నష్టంపై నివేదికలను కేంద్ర బృందంకు అందచేయడానికి సిద్దం చెశాయి. జలాశయాలలో నీటి మట్టం తగ్గడం వలన త్రాగునీటికి కలుగుతున్న ఇబ్బందు లను కేంద్ర బృందంకు వివరించడానికి హైద్రాబాద్ మహనగర నీటి పారుదల సంస్థ అధికారులు ప్రత్యేకంగా నివేదికలు తయారు చేయడంతో పాటు గండి పేట జలాశయం వద్ద వచ్చిన కేంద్ర బృందంకు వివరించడానికి కావలసిన ఏర్పాట్లు చేశారు.
జాయింట్ కలెక్టర్ సమీక్ష…
జిల్లాలో కేంద్ర బృందం పరిశీలనకు వస్తుండటంతో చెపట్టవలసిన కార్యక్ర మాలు, నివేదికలపై జాయింట్ కలెక్టర్ రజిత్ కుమార్ సోమవారం నాడు సమీక్షించారు. డిఆర్‌ఓ దర్మారెడ్డి, పశు సంవర్దక శాఖ జెడి వరప్రసాద్ రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగదీష్. సిపిఓ శర్మ, ఆర్‌డబ్లుఎస్ ఎస్‌ఇ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఇఇ బీంప్రసాద్, ఆర్‌డిఓలు సుదాకర్, సురేష్ పొద్దార్‌తో పాటు పలు శాఖల అధికారులతో చర్చించారు.