Search
Saturday 22 September 2018
  • :
  • :

తల్లికి పురుగుల మందు తాగించి చంపిన కొడుకులు

MURDERమన తెలంగాణ/నార్కట్‌పల్లి: మద్యం మత్తులో ఘర్షణ పడి కన్నతల్లిని కొడుకులే చంపిన ఘటన గురువారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గద్దగూటి బావిలో చోటు చేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. బోయిని పిచ్చమ్మకు వెంకన్న, నరేశ్ ఇద్దరు కొడుకులు. గ్రామంలో బంధువులకు సంబంధించిన సంవత్సరికం కార్యక్రమంలో విచ్చలవిడిగా మద్యం తాగి తల్లితో గొడవ పడ్డారు. అదే మత్తులో తల్లికి పురుగుల మందు తాగించి హత్య చేశారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మోతీరాం తెలిపారు.

Comments

comments