Home మహబూబ్‌నగర్ మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు

మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు

Drink water on the house with mishan bhagiratha

అపరభగీరథుడు సిఎం కెసిఆర్ మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: ఆనాడు భగీరథుడు ఆకాశ గంగను నేలకు తెచ్చి అపర భగీరథుడయ్యాడని, నేడు భూ ఉపరితల నది నుంచి ఇంటింటికి మంచి నీరు అందిస్తూ ఆధునిక అపర భగీరథుడయ్యారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి అ న్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటిసారిగా జడ్చర్ల నియోజకవర్గంలో ఇంటింటికీ బృహత్తర భగీరథ మంచి నీటి పథకాన్ని మంత్రి లకా్ష్మరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. నాగసాల, నస్రుల్లాబాద్, బూ ర్గుపల్లి గ్రామాల్లో నల్లాల ద్వారా తాగు నీటిని అందించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. నల్లాల ద్వారా తాగునీటిని పట్టి మంత్రి స్వయంగా మహిళలకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మిషన్ భగీరథ నీళ్లను తాగారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ చేపట్టిన మిషన్‌కాకతీయ, హరితహారం, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్, రైతు బంధు, తదితర ప్రజా సంక్షేమ పథకాలు దేశంలో ఏ సిఎం చేయని విధంగా అమలుచేస్తున్నారన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నిరంతరం మంచి నీటిని అందించాలన్న తలంపుతో ప్రారంభించిన పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. నీరు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణను అన్ని విధాలుగా సిఎం కెసిఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదని సవాల్ విసిరిన వారు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అద్భుతమైన పథకాలు చేసి ఓర్వలేకపోతున్నారన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని అమలులోకి తీసుకువచ్చి కెసిఆర్ రైతు బాంధవుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ఆనాడు ఉద్యమసారథిగా, నేడు ప్రభుత్వ సారథిగా సిఎం కెసిఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
60 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాలుగేళ్లలో చేసి చూపామని, మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ఇక అధికారంలోకి రావడం కష్టమని భావించిన కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతూ ప్రజలకు లేనిపోని మాటలు చెబుతూ ప్రభుత్వాన్ని ఆభాసుపాలు చేయాలని చూస్తున్నారని, ప్రజలు దీనిని నమ్మేస్థితిలో లేరన్నారు. జడ్‌పిటిసి జయప్రద, ఎంపిపి లక్ష్మీ, జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు బాద్మి శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.