Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పబ్లిక్‌గా మందుకొడితే ఫైన్

Drinking in Public Places in Goa to Attract Fine

పనాజీ : గోవాలో పబ్లిక్‌గా మందు కొడితే జరిమానా విధించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పబ్లిక్‌గా మందు కొడితే రూ.2,500 జరిమానా విధిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. రోడ్లపై ఖాళీ బీరు సీసాలు పడి ఉంటున్నాయని, రివర్ ఫ్రంట్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీరు తాగుతూ కనిపిస్తున్నారని పారికర్ చెప్పారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. చివరకు అమ్మాయిలు సైతం పబ్లిక్‌గా మందు తాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా మందు తాగే వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

Drinking in Public Places in Goa to Attract  Fine

Comments

comments