Home తాజా వార్తలు ఫిల్టర్ వాటర్ పేరుతో జోరుగా వ్యాపారం

ఫిల్టర్ వాటర్ పేరుతో జోరుగా వ్యాపారం

Drinking Water Minerals and Mineral Balance
నామమాత్రంగా నీటి శుద్ది
నాన్యత ప్రమానాలను గాలికి వదిలిన నీటి వ్యాపారులు
ప్లాంట్లకు అనుమతులు సున్న
వేసవి కాలంలో కూల్ వాటర్ పేరుతో కూల్‌గా దోస్తున్న వ్యాపారులు
చోద్యం చూస్తున్న అధికారులు
అచ్చంపేట: నీటి వల్లనే అనేక రోగాలు ప్రజల దరి చేరుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఫిల్టర్ చేసిన మినరల్ వాటర్‌ను త్రాగి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి కుటుబం తప్పని సరిగి మినరల్ వాటర్‌ను కొనక తప్పడం లేదు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న నీటి వ్యాపారులు నియోజక వర్గంలోని అన్ని మండలాలలో ఎలాంటి అనుమతులు లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి లాంటి నిభందనలు పాటించకుండా కేవలం కెమికల్‌తో నీటి రుచిని మార్చి ప్రజలకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారు. 20 లీటర్ల నీటని 10 రూపాయలు వెచ్చించి నీటిని కొనుగోలు చేసి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వేసవి కాలం వచ్చందటే నీటి వ్యాపారులు తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కనీస నిభందనలు పాటించకుండా ప్రజలకు నీటి సరఫరా చేస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాట మాడుతున్నారు.. వేసవి కాలం వచ్చిందంటే కూల్ వాటర్ పేరుతో ప్రతి వినియోగ దారుని నుండి రూ.400 నుండి 500 డిపాజిట్‌లు కట్టించుకుని 20 లీటర్ల క్యాన్ నీటిని 40 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అచ్చంపేట పట్టణంలో ఆర్‌రెడ్డి, వీఆర్‌రెడ్డి, తిరుమల వాటర్ పేర్లతో కూల్ వాటర్ దందా కొనసాగుతుంది. పట్టణ ప్రజలకు నీల్లు లేక అల్లాడుతున్న సమయంలోను పట్టణంలోనే ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపనారాలను కొనసాగిస్తున్నారు.. అచ్చంపేట పట్టణంతో పాటు, నియోజకె వర్గంలోని ఏఒక్క ప్లాంటుకు సరైన అనుమతులు లేక పోయిన మామూల్ల మత్తుకు అలవాటు పడిన అధికారులు నీటి వ్యాపారులకు అన్నివిదాలుగా సహకరిస్తూ ప్రజల ఆరోగ్యాలను గాలికి వదులుతున్నరానే ఆరోపణలు ప్రజలనుండి వినిపిస్తున్నాయి. ప్రజలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లను సైతం శుభ్ర పరుచకుండానే నీటిని సరఫరా చేస్తుండడంతో ప్రజలు కలుషిత నీటిని త్రాగి ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల కల్ల ముందే ఈతంతు జరుగుతున్న ఏఒక్క అధికారి వాటర్ ప్లాంట్లను తనిఖీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవనే చెప్పాలి. నీటి వ్యాపారులకు అధికారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన సంభందిత అధికారులు స్పందించి నీటి ప్లాంట్లను పరిశీలించి నాన్యత ప్రమానాలు పాటించని ప్లాంట్లను సీజ్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.