Search
Monday 24 September 2018
  • :
  • :

వేసవి రాకముందే

రామగుండంలో జటిలంగా మారుతున్న మంచినీటి సమస్య
మూడు రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్న కార్పోరేషన్ అధికారులు
రెండేళ్లుగా నెరవేరని ప్రజాప్రతినిధుల హామీ 

పట్టించుకోని సింగరేణి యాజమాన్యం

Ramagundam

గోదావరిఖని: రామగుండం మున్సిప ల్ కార్పోరేషన్ పరిధిలో మంచినీటి సరఫరా జటిలంగా మారుతోంది. వేసవి కాలం రాకముందే కార్పోరేషన్ ప రిధిలోని 50డివిజన్లలో నివసిస్తున్న ప్రజలకు మంచినీ టి ఎద్దడి చూపిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రోజు వి డిచి రోజు మంచినీటి సరఫరా చేసిన కార్పోరేషన్ అధి కారులు ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. వర్షాకాలం ముగియటంతో పక్కనే ఉన్న గోదావరి నది మరోసారి ఎడారిగా మారింది. నదిపైన నిర్మించిన ఎల్లంపెల్లి శ్రీపాద ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉన్న ఈ ప్రాంతానికి మంచి నీటి ఎద్దడి తప్పటం లేదు. ప్రాజెక్టు నుంచి గజ్వేల్ మీ దుగా హైదరాబాద్ వరకు మంచినీటి సరఫరా చేస్తున్న అధికారులు రామగుండం ప్రాంతాన్ని నిర్లక్షం చేయ డంపై స్థానికులు మండిపడుతున్నారు. త్వరలోనే ఎల్లం పల్లి ప్రాజెక్టు నుంచి మంచినీటి సరఫరా ప్రారంభ మవుతుందని గత రెండేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

దీనికి తోడు సింగరేణి యాజమాన్యం కూడా మంచినీటి సరఫరాపై పూర్తి నిర్లక్షంగా వ్యవహరిస్తోంది. సింగ రేణి సంస్థలో ఆందోళన చేసేవరకు ఏ సమస్యా పరిష్కా రం కాదని కార్మిక నేతలు పదేపదే అంటుంటారు. ఇటీ వలే జనగామ, లింగాపూర్ గ్రామాల సమస్యల పరి ష్కారం ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఎ న్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, శాంతియుత ఆందోళనలు చేసినా పట్టించుకోని సింగరేణి అధికారులు గ్రామస్తులు దాడులు చేసేస్థాయికి దిగగానే సమస్యలు పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు. మంచినీటి సరఫరా మెరుగుపడేం దుకు మున్సిపల్ కార్యాలయం వద్ద సింగరేణి జియం కార్యాలయం వద్ద భారీ ధర్నాలు నిర్వహిస్తే తప్ప సమ స్యలు పరిష్కారం కావని పలువురు కార్పోరేటర్లు వ్యా ఖ్యానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై చొరవ చూ పి వేసవి రాకముందే రక్షిత మంచినీటి సరఫరా మె రుగు పడేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

comments