Home ఖమ్మం తాగునీటి పథకాలు నిర్వీర్యం: భట్టి

తాగునీటి పథకాలు నిర్వీర్యం: భట్టి

Bhatti-Vikramarka

ఖమ్మం: రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి పథకాలను నిర్లక్షం చేశారని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చి మెప్పు పొందాలని టిఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారన్నారు. తాగునీటి పథకాలు నిర్వహించే సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పథకం ప్రకారమే తాగునీటి పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని వెల్లడించారు.