Home నాగర్ కర్నూల్ మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు: ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి

మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు: ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి

Drinking water with Mission bhagiratha inHouse to house

మనతెలంగాణ/వెల్దండ: ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నెంబర్1 స్థానాన్నిసాధించిందనిమహబూబ్ నగర్ ఎంఎల్‌సి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.వెల్దండ మండలం చౌదర్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పల్గుతండాలో మిషన్ భగీరథ పథకం కింద ఇరవై వేయిల లీటర్ల నిలువ సామర్దం గల ట్యాంకు పనులు భూమి పూజ  శంకుస్థాపన కార్య క్రమం బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంఎల్‌సి ముఖ్య అతిధిగా పాల్గొని పనులను ప్రారంంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటిని అందించి ఆడు పడుచుల నీటి కష్టాలను నివారిస్తామని,భగీరథ పథకం పనులు చివరి అంకానికి చేరుకున్నాయని మన ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారమే ఇంటింటికి నీటిని ఇచ్చి తీరుతారని ,ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయ ని ఎన్నో పనులను మన ముఖ్యమంత్రి చేసి చూపించారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సమ న్వయ సమితి కన్వీనర్ యెన్నం భూపతిరెడ్డి, జడ్పీ టీసి తనయుడు టీఆర్‌ఎస్ తాలూకా నాయ కుడు వావిళ్ళ సంజీవ్ కుమార్ యాదవ్,పిఏసిఎస్ చైర్మన్ మోహన్‌రెడ్డి,సర్పంచ్ రామస్వామి, ఎంపి టిసి నాగులూ నాయక్ నాయకులు నారాయణ, రవిందర్‌నాయక్,కొండల్,రైతులు పాల్గొన్నారు.