Search
Wednesday 14 November 2018
  • :
  • :

డివైడర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

3 Year Old Boy died in School Bus Accident in Hyderabad

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం గరికపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌విఆర్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు వెనకనుంచి మరో రెండు బస్సులు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Comments

comments