Search
Wednesday 21 November 2018
  • :
  • :

రెండు డిసిఎం లు ఢీ: డ్రైవర్ మృతి

Driver Dies In Road Accident In Mahabubabd District

కురవి ః  పశువులను తరలిస్తున్న రెండు డిసిఎం వాహనాలు ఎదురెదురుగా డీ కొట్టిన సంఘటనలో డ్రైవర్ మృతి, మరో డ్రైవర్‌కు తీవ్రగాయాలు జరిగిన సంఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన చిట్టిపురెడ్డి వెంకట్‌రెడ్డి కురవి శ్రీ వీరభద్రస్వామి ఆలయం చైర్మన్ రాజునాయక్ చెందిన డిసిఎం వాహనంపై డ్రైవర్‌గా చేస్తున్నాడు. అలాగే మండల కేంద్రానికి చెందిన ఈర్ల ఉపాకర్ కొన్ని నెలలుగా మహేష్‌కు చెందిన డిసిఎం వాహనంపై డ్రైవర్‌గా చేస్తున్నాడు. ఉపాకర్ డ్రైవర్ డిసిఎం వాహనంతో కురవి నుండి మరిపెడ వైపు వెళ్ళు క్రమంలో భైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకోవాలని, అయ్యగారిపల్లి గ్రామంలో నిద్రిస్తున్న వెంకట్‌రెడ్డికి పోన్ చేశారు. వెంటనే డిసిఎం తొలుకుంటూ కురవికి వస్తున్న క్రమంలో గ్రామ శివారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి కురవి నుండి వస్తున్న డిసిఎంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డిసిఎం డ్రైవర్లకు తీవ్రగాయాలైనాయి. డిసిఎం డ్రైవర్లు ఉపాకర్, వెంకట్‌రెడ్డిలను మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విసమిస్తుందని డాక్టర్ చెప్పడంతో వెంకట్‌రెడ్డిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. దీంతో బందువులు, కుటుంబ సభ్యులు వెంకట్‌రెడ్డి మృత దేహాంతో మండల కేంద్రంలోని మహేష్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. పోలీస్‌లు అక్కడికి చేరుకుని అదుపు చేశారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించుకున్నారు. తీవ్ర గాయాలైన ఈర్ల ఉపాకర్ వరంగల్‌లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య విజయ, కుమారుడు నితీన్‌రెడ్డి, కుమార్తె భానుశ్రీ లు ఉన్నారు. ఇట్టి విషయంపై కురవి పోలీస్‌లకు మన తెలంగాణ పోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. కాగా సిపిఐ పార్టీ జిల్లా సహయకార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి తదితర నాయకులు మృతదేహానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

comments