Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టిప్పర్ బోల్తా: క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్

Driver Injured In Tipper Accident in Medak Dist
వెల్దుర్తిః రోడ్డు మధ్యలో ఉన్న గుంతను తప్పించబోయి కంకర లోడ్‌తో వెళుతున్న టిప్పర్ బోల్తాపడింది. ఘటనలో వాహన డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయాడు. గంటన్నరపాటు నరకయాతన అనుభవించిన డ్రైవర్‌ను పోలీసులు జెసిబి సాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదకర ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్ పంచాయితీ పరిధి శంశిరెడ్డిపల్లి తండ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శివ్వంపేట మండలం ఉసిరికపల్లి కంకర పరిశ్రమ నుండి కంకరలోడ్‌తో మెదక్ వైపు వెళుతున్న టిప్పర్ శంశిరెడ్డిపల్లి తండ సమీపంలోని రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి పల్టీకొట్టింది. దీంతో శివ్వంపేట మండలంలోని గోమారంకు చెందిన డ్రైవర్ స్వామి టిప్పర్ క్యాబిన్‌లోనే ఇరుక్కున్నాడు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ గంగరాజు తన సిబ్బందితో సంఘటన స్థలానికి హుటాహుటీన చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాడు. స్థానికులు, ఇతర వాహనదారులతో కలిసి డ్రైవర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జెసిబి సహాయంతో గంటన్నర పాటు శ్రమించి వాహనంలో చిక్కుకున్న డ్రైవర్ స్వామిని బయటకు తీసి 108 వాహనంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ బోల్తాపడిన ప్రదేశంలోనే ఇటీవల పలు వాహనాలు కూడా ప్రమాదానికి గురయ్యాయని వాహన దారులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం భరితంగా ఉన్న గుంతలను వెంటనే పూడ్చివేయాలని విజ్ఙప్తి చేస్తున్నారు.

Comments

comments