Home తాజా వార్తలు డ్రైవర్ నిర్లక్షంతో ఆటో బోల్తా విద్యార్ధులకు గాయాలు

డ్రైవర్ నిర్లక్షంతో ఆటో బోల్తా విద్యార్ధులకు గాయాలు

student
మనతెలంగాణ/మఠంపల్లి ః ఆటోబోల్తా పడి విద్యార్ధులకు గాయాలైన సంఘటన మండలంలోని కొత్తతండాలో సోమవారం చోటుచేసుకుంది. స్ధానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని మోడల్‌స్కూల్‌కు చెందిన సుమారు 15మంది విద్యార్ధులు తమ సొంత గ్రామమైన అల్లీపురంకు ఆటోలో వెళ్తుండగా కొత్తతండా వద్ద డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఆటో బోల్తా పడినట్లు తెలిపారు. వెంటనే తండాకు చెందిన గ్రామస్తులు, స్సందన యూత్ సబ్యులు 108కి ఫోన్ చేసి మెరుగైన వైద్యం కోసం హుజూర్‌నగర్ ప్రభుత్వ హాస్పత్రికి తరలించారు.
బస్సు సౌకర్యం కల్పించాలి……తండాలకు బస్సు సౌకర్యం లేక ఆటోల మీద ప్రయాణం చేయాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్‌టిసి బస్సు సౌకర్యం కల్పించాలని తండావాసులు వేడుకుంటున్నారు.