Home రాష్ట్ర వార్తలు వాస్తవాల ప్రాతిపదికన కరువు మండలాలు: చాడ

వాస్తవాల ప్రాతిపదికన కరువు మండలాలు: చాడ

Chada-Venkat-Reddy22మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వాస్తవాల ప్రాతిపదికన కరువు మండలాలను ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు సహాయక చర్యల్లో భాగంగా వలసల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా మారిందని, నల్లగొండ, మహబూబ్‌నగర్, రం గారెడ్డి జిల్లాలో ప్రజలు వలసలకు సిద్ధపడుతున్నారని చాడ వెంకటరెడ్డి తెలిపారు. కేంద్ర కరువు బృందం వివిధ జిల్లాల్లో పర్యటించిన సందర్భంలో రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారని, కరువు పరిస్థితులు కేంద్ర బృందం దృష్టికి వచ్చాయని తెలిపారు. కరువు పరిస్థితులను అంచనా వేయడానికి మరింత కసరత్తు చేయాలని, పునః సమీక్షిం చాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన వరి, తదితర మెట్ట పంటలకు ఎకరానికి రూ.15వేలు, వాణిజ్య పంటలకు రూ. 30వేల నష్టపరిహారం ఇవ్వాలని, తక్కువ నీటితో ఆహార ప్రైవేటు అప్పులపై మారిట్‌రియం విధించాలని, 60 సంవత్సరాలు దాటిన వారికి ఆసరా పథకం ద్వారా రూ.1000 కరువు పెన్షన్‌ను,  ప్రతి కుటుం బానికి రూపాయికి కిలో బియ్యంతో పాటు వంటనూనె, పప్పులు సబ్బులు తదితర నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.