Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఎక్సైజ్ ఆఫీస్‌లోనే మందు,పేకాట

Wine1

నిజామాబాద్ క్రైం : మందు, విందు, పేకాటతో ఓ ప్రభుత్వ శాఖ అధికారులు పండుగ చేసుకుంటున్నారు. దీనికి ప్రభుత్వ కార్యాలయాన్నే అడ్డాగా మార్చుకున్నారు. పేకాట, మధ్యం మత్తులో మునిగితేలాడారు. జీతం కాకుండా మామూళ్లు(లంచాలు) చేతినిండా ఉండడంతో వింధులు, వినోదాలకు కొదవలేకుండా పోయింది. ప్రజలతో సంబంధం లేకుండా ఉండే ఈ శాఖ అధికారులు తామే రారాజులమని విర్రవీగుతున్నారు. చేతికి చమురు లేకపోతే అడపదడప దాడులు చేసి కావాల్సినంత తెచ్చుకొని వినోదాలకు పాల్పడుతున్నారు. కిక్కు ఎక్కిన తర్వాత వారిలో వారే బూతుపురాణాలతో తన్నుకుంటున్నారు.. బుధవారం రాత్రి “మన తెలంగాణ” నిఘాలో బయటపడిన అసలు విషయం ఏంటంటే…

గణతంత్ర దినోత్సవం ముందు రోజే : ఎక్సైజ్ అంటేనే..మామూళ్లకు పుట్టినిల్లు. గణతంత్ర దినోత్సవాలకు కార్యాలయాలన్ని ముస్తాబవుతున్న తరుణంలో ఎక్సైజ్ శాఖ సైతం అదే కోవలో పనిచేస్తుందనే భావన కలిగింది. ప్రభుత్వ శాఖలో ఏదైనా పనులు ఉంటే తొందరగా ముగించుకొని వెళ్లిపోతారు. మరి ఈ శాఖలో ఆర్ధారాత్రి వేళ లైట్లు వెలుగుతు ఉండడమే కాకుండా మాటల శబ్దాలు వినబడుతున్నాయి. ఈ విషయం పసిగట్టిన వారు ఏం జరుగుతుందో అర్థంగాక మనతెలంగాణకు సమాచారం అందించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ప్రోబిషన్ అండ్ ఎక్సైజ్ నిజామాబాద్ ఎస్‌హెచ్‌వో కార్యాలయంలో కానిస్టేబుల్‌లు స్వయంగా తమ కార్యాలయంలోనే మధ్యం సేవిస్తు, జూదం ఆడుతున్నారు.

సాయంత్రం అయితే చాలు ఆ శాఖ కార్యాలయం జల్సాలకు అడ్డగా మారింది. గణతంత్ర దినోత్సవం రోజుకు ముందు (బుధవారం) రాత్రి సుమారు పది మంది ఎక్సైజ్ శాఖ సిబ్బంది కార్యాలయంలోని లోపలి గదిలో మధ్యం సేవిస్తు, జూదం అడుతున్నారు. కార్యాలయాల్లో ఇలాంటి కార్యకలపాలు చేయడం చట్టరీత్య నేరం అని తెలిసిన ఇవేమి పట్టించుకోకుండా అధికారులు తమ జల్సాను కొనసాగిస్తున్నారు. అదే సమ యంలో వీరి పై అధికారి వచ్చి వారితో కాసేపు గడిపి మీరు కానివ్వండి అని చెప్పి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయం పై అధికారికి తెలిసిన చూసి చూడనట్టు వదిలివేయడంతో వీళ్ల అగడాలకు అదుపు లేకుండా పోయింది.

పేకాటలో ఇద్దరి కానిస్టేబుల్ మధ్య రగడ : ఎక్సైజ్ శాఖలో జూదం ఆడుతున్న కానిస్టేబుల్ మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది..బూతు పురాణాలతో ఇతర సిబ్బంది ముందే గొడవకు దిగారు. పేకాటలో లాభనష్టాలపై జరుగుతున్న గొడవలో మధ్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు కొట్టుకోవడానికి సైతం సిద్ధమయ్యారు. మాటామాట పెరగడంతో అక్కడే ఉన్న ఇతర సిబ్బంది ఇద్దరిని సముదాయించడానికి ప్రయత్నించారు. అయిన వినని ఆ ఇద్దరి గొడవ మరింత ముదిరింది. కొంతసేపు వాగ్వివాదం చేసుకున్నఅనంతరం సద్దుమనిగినట్లు తెలిసింది.

Comments

comments