Search
Tuesday 20 November 2018
  • :
  • :

కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి

KCR-and-Revanth-Reddy

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన గురువారం తెలంగాణ సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. డ్రగ్స్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. డ్రగ్స్ కేసులో ఎంతటి పెద్దవారు ఉన్నా, ఉపేక్షించవద్దని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో సినీరంగం వారితో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల వారు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నందున కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆయన సూచించారు.

Drugs case: Investigation should be conducted with the Central Investigation Agency

Comments

comments