Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో డ్రగ్స్ ముఠా అరెస్టు

DRUGS
హైదరాబాద్: నగరంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు నౌజీరియన్లను శుక్రవారం హైదరాబాద్ పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు10లోని ఓ ఇంట్లో కొకైన్, హెరాయిన్ ప్యాకెట్లతో ఉన్న నైజీరియన్లను పోలీసులు దాడులు జరిపి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 20 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని, దీనిని ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే దానిపై నిందితులను కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments