Home తాజా వార్తలు డ్రగ్స్ ముఠా అరెస్టు

డ్రగ్స్ ముఠా అరెస్టు

Drugs Gang Arrested in Hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఘటన రామంతపూర్‌లో జరిగింది. అరెస్టు అయిన నిందితుల నుంచి 10 గ్రాముల హెరాయిన్, 15 ఎల్‌ఎస్‌డి బ్లాట్స్, 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులు గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ విక్రయించినా, కొన్నా నేరమని పోలీసులు తెలిపారు. నగరంలో డ్రగ్స్ విక్రయించే వారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Drugs Gang Arrested in Hyderabad