Home తాజా వార్తలు బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

బంజారాహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

Drunk-and-Drive-checksహైదరాబాద్ : బంజారాహిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్ నెం.2లోని ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ దారిలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరికరంతో పరీక్షలు నిర్వహించారు. ఆరుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని పంజాగుట్ట సిఐ సంతోష్ కిరణ్ వెల్లడించారు.