Home తాజా వార్తలు బంజార హిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్…

బంజార హిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్…

Drunk and Drive in Banjara Hills

హైదరాబాద్: నగరంలోని బంజార హిల్స్‌లో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 19 మందిపై కేసు నమోదు చేశారు. సోదాల్లో భాగంగా సరియైన పత్రాలు లేని 12 కార్లు, 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అటుగా కారులో వచ్చిన ఓ యువతి పోలీసులకు పరుగులు పెట్టించింది. బ్రీత్ అనలైజర్‌తో టెస్ట్ చేసేందుకు యత్నించిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యువతి ర్యాష్‌గా డ్రైవ్ చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. దీంతో పోలీసులు ఆమెను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం బ్రీత్ అనలైజర్ టెస్టులో ఆమె తాగలేదని నిర్ధారణ అయింది. కాగా, ఆమెపై ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు.