Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ప్రియుడి మోసం..రోడ్డుపై ప్రియురాలి డ్యాన్స్..!(వీడియో)

Girl-Dance-infront-of-Boyfr

చండీగఢ్: ఇటీవల కాలంలో ప్రేమ పేరుతో మోసపోతున్న యువతి యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతన్న ఘటనలు తరుచూ జరుగుతునే ఉన్నాయి. అయితే తాజాగా హర్యానాకు చెందిన ఓ యువతి మాత్రం తనను మోసం చేసిన ప్రియుడి ఇంటిముందు వెరైటీ నిరసనకు దిగింది. ప్రియుడి ఇంటి ముందు డిజె పెట్టుకుని డ్యాన్స్ చేసి హల్‌చల్ చేసింది. హర్యానాలోని పటౌడీ ప్రాంతంలో ఓ యువతి ఈ వినూత్న నిరసన చేపట్టింది. గత కొంతకాలంగా తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఇటీవల వదిలేయడంతో తట్టుకోలేకపోయిన యువతి పూటుగా మద్యం సేవించి ప్రియుడి ఇంటిముందు చిందులేసింది. ఆమె చిందులు చూసి అక్కడివారంతా నోరెళ్లబెట్టారు. చాలా మంది గుమిగూడిన ఆమె మాత్రం తనకేమి పట్టనట్లు నృత్యం చేస్తూనే ఉంది. అయితే ఈ తతంగాన్నంతటినీ అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన బ్లాక్‌బస్టర్ రాజా హిందుస్థానీ చిత్రంలోని ‘తేరే ఇష్క్ మే నాచేంగే’ అనే పాటపై యువతి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ భగ్న ప్రేమికురాలి వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

Comments

comments