Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

తాగిన మైకంలో పోలీసులపై యువతుల చిందులు..!(వీడియో)

Drunk Women Creates Nuisance In Police Station

ముంబయి: ట్రాఫిక్ పోలీసులకు ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికితే జరిమానా విధించి, వారి వాహనాలను స్వాధీనం చేసుకోవడం కామన్. అలాగే మహారాష్ట్రలోని పింప్రీలో మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరు యువతులకు పోలీసులు జరిమానా విధించడంతో పాటు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అంతే… సదరు యువతులు పోలీసులపై విరుచుకుపడ్డారు. మాకే ఫైన్ వేస్తారా అంటూ పోలీస్ స్టేషన్ లో వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడుపుతుండడంతో జరిమానా విధించిన అధికారులపై యువతులు రెచ్చిపోయారు. వివరాల్లోకి వెళితే…  పూణే సమీపంలోని పింప్రీ ప్రాంతంలో ఇద్దరు యువతులు మద్యం మత్తులో కారు నడుపుతూ పోలీసులకు దొరికారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు వీరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో తాగిన మైకంలో ఉన్న ఆ ఇద్దరు యువతులు పిఎస్ లో రచ్చరచ్చ చేశారు. ఓ యువతి అయితే ఏకంగా సీనియర్ పోలీస్ అధికారిపై తిట్ల పురాణం అందుకుంది. అంతటితో ఆగకుండా అధికారిపై దాడిచేసేందుకు యత్నించింది. దాంతో పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా, పోలీసుల విచారణలో వీరిద్దరూ డ్యాన్సర్లు అని తేలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తోంది.

Comments

comments