Home ఆఫ్ బీట్ వీడియోలు మద్యం మత్తులో యువతుల వీరంగం…

మద్యం మత్తులో యువతుల వీరంగం…

Drunken girl creates nuisance

హైదరాబాద్: మద్యం మత్తులో చిత్తైన ఇద్దరు యువతులు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పుటుగా మద్యం సేవించిన యువతులు ప్రసాద్ ల్యాబ్ వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయారు. ఇలా వరుసగా 4 వాహనాలను ఢీకొట్టారు. దీంతో స్థానికులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతులను వాకాబు చేయగా కారులో మద్యం బాటిళ్లు లభించాయి. యువతులకు బ్రీత్ ఎన్‌లేజర్‌తో టెస్టు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దీంతో యువతులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు. కాగా, స్టేషన్‌కు వచ్చి యువతుల బాయ్‌ఫ్రెండ్స్ వారిని తీసుకెళ్లారు. ఈ క్రమంలో కవరేజ్ చేస్తున్న మీడియాతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది.

(Courtesy: NTv)