Home ఆఫ్ బీట్ మద్యం మత్తులో చెవి కొరికి మింగేశాడు..!

మద్యం మత్తులో చెవి కొరికి మింగేశాడు..!

Drunken man bites off another’s ear then swallows it in Delhi

న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో యువకుడి చెవి కొరికి మింగేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని సుల్తాన్ పూర్‌లో నివాసముండే కుమార్ కారు డ్రైవర్. కుమార్ తన ఇంటి సమీపంలోని రోడ్డుపై ఉండగా, అదే సమయంలో పూటుగా మద్యం సేవించిన సంతోష్, దీపక్ అనే మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. అనంతరం కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరగడంతో సంతోష్ అనే యువకుడు కోపోద్రిక్తుడై కుమార్ చెవిని కొరికి దాన్ని అలాగే మింగేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కుమార్‌ను స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో కుమార్‌తో సంతోష్‌కు ఉన్న పాత గొడవ కారణంగానే అతడి చెవి కొరినట్టు తేలింది.