Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్న మందుబాబులు

Two-Groups-Fightథానే: మహారాష్ట్రలోని థానేలో తాగిన మత్తులో కొందరు వ్యక్తులు వీరంగం సృష్టించారు. తన కారుపై మూత్రవిసర్జన చేస్తుంటే వారించినందుకు ఓ కానిస్టేబుల్‌పై ఐదుగురు మందుబాబులు దాడికి దిగారు. ఈ ఘటన థానే జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పీకల దాక తాగిన ఆకతాయిలు కానిస్టేబుల్ సతీష్‌పై ఐదు నిమిషాలపాటు విచక్షణారహితంగా చితకబాదారు. అయితే ఘటనాస్థలంలో పలువురు ఉన్నప్పటికీ ఎవరు కూడా వారికి అడ్డు చెప్పక పోవడం గమనార్హం. కాగా, బార్ సిబ్బంది వారించడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి గజాడే తెలిపారు.

Comments

comments