Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

క్యాన్సర్ కారకాలతో పోరాడే ఎండుద్రాక్ష

KisMis

తీపి పులుపు కలయికల రుచితో ఉండే ఎండుద్రాక్షను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలంటున్నారు ఆరోగ్యనిపుణులు.

  • ఎండు ద్రాక్షలను తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. వంద గ్రాముల ఎండు ద్రాక్షలో రెండొందల యాభై కేలోరీలుంటాయి.
  • శ్రమ చేసేవారికీ, చిన్నారులకు ఎండుద్రాక్షల్ని ఎంత తినిపిస్తే అంత మంచిది.
  • క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం వీటికుంది.
  • తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
  • ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాం. అంతేగాక, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి.
  • వంద గ్రాముల ఎండు ద్రాక్షలో పది శాతం పీచు ఉంటుంది.
  • ఇది బరువు, కొలెస్ట్రాల్ శాతం తగ్గడానికి ఉపయోగ పడుతుంది.
  • కాల్షియం, ఇనుమూ, మాంగనీసు, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి ఎండు ద్రాక్షలో అధికంగా ఉన్నాయి.
  • వంద గ్రాముల ద్రాక్షలో ఏడొందల నలభై తొమ్మిది గ్రాముల పొటాషియం ఉంటుంది. ఇది హృద్రోగాలను దూరం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • విటమిన్ బి లోపం కూడా దూరం అవుతుంది. థయామిన్, రైబోఫ్లెవిన్ శరీరానికి సరిపడా అందుతాయి

Comments

comments