Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

లైంగిక వేధింపుల వివాదంలో డిఎస్ కొడుకు

naini

పిఒడబ్లు సంధ్యతో కలసి హోంమంత్రికి ఫిర్యాదు చేసిన నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు
శాంకరీ నర్సింగ్ కళాశాల చైర్మన్ సంజయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
తక్షణ విచారణకు డిజిపిని ఆదేశించిన నాయిని

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కొడుకు, శాంకరీ నర్సింగ్ కళాశాల ఛైర్మన్ ధర్మపురి సంజయ్‌పై మరోసారి లైం గిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తమ ను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్ కు చెందిన శాంకరీ నర్సింగ్ కళాశాల బాధి త విద్యార్థినులు గురువారం ఏకంగా హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రగతిశీల మహిళా సమాఖ్య (పిఒడబ్లు) అధ్యక్షురా లు సంధ్య నేతృత్వంలో బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు  సచివాలయంలో మంత్రి నాయినిని కలిసి  వినతిపత్రం అందజేశారు. ధర్మపురి సంజయ్ కళాశాల విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. ఆ కశాశాలలో చేరిన 13 మందిలో ఇప్పటి వరకు 11 మందిని లైంగికంగా వేధించినట్లు బాధితులు ఆరోపించారు. కొందరిని బూతు మాటలతో వేధించారని, కాలేజీ అడ్మిషన్ సమయంలో ఉన్న ప్రిన్సిపాల్‌ను తొలగించి, అప్పటి నుంచి తమను హాస్టల్‌కు రావాలని తమపై సంజయ్ ఒత్తిడి తెచ్చేవారని విమర్శించారు. అసభ్య పదజాలంతో దూషించి తమను భయబ్రాంతులకు గురి చేసేవారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని బలవంతంగా తీసుకెళ్లి సంజయ్ లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా ప్రతి ఘటించామని, అదే సమయంలో సంజయ్‌కి సన్నిహితురాలైన ఓ మహిళా లెక్చరర్ అక్కడికి రావడంతో విద్యార్థులను వదిలిపెట్టారని బాధితులు వివరించారు. జూలై 26న మరోక విద్యార్థినిని ఇంటికి తీసుకెళ్లి పై దుస్తులు తొలగించమని బలవంతం చేసేవారని, ఆ అమ్మాయికి తోడుగా వెళ్లిన విద్యార్థినిని గదిలో బంధించారని వారు మంత్రికి అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ధర్మపురి సంజయ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలోను ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి ఆరోపణలు రావడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
విచారించి నివేదిక ఇవ్వండి : నాయిని
శాంకరి నర్సింగ్ కళాశాల ఘటనపై తక్షణమే విచారణ జరిపి తమకు నివేదిక అందించాని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన నాయిని అప్పటికప్పుడు డిజిపికి ఫోన్ చేశారు. నిజామాబాద్ కమిషనర్ కార్తీకేయ ఆధ్వర్యంలో విచారణ జరిపించాల న్నారు. కాగా బాధితులు, వారి తల్లిదండ్రులు కూడా డిజిపి, నిజామాబాద్ పోలీసులును కలిసి జరిగిన ఘటన వివరాలను తెలియజేయాలని నాయిని వారికి సూచించారు.
సంజయ్‌ను అరెస్టు చేయండి: సంధ్య
సంజయ్‌ను అరెస్టు చేసి, శాంకరి నర్సింగ్ కళాశాల అనుమతిని రద్దు చేయాలని పివోడబ్లు అధ్యక్షులు సంధ్య డిమాండ్ చేశారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇతర కళాశాలలో అడ్మిషన్లు కల్పించాలని కోరారు. గతంలో సీతాస్కూల్ ఆఫ్ నర్సింగ్ నిర్వాహకులు శర్మ కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడితే ఆయనను అరెస్టు చేశారని, ఆ కశాళాల గుర్తింపును రద్దు చేసి అక్కడ చదువుతున్న విద్యార్థినులను ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌లో అడ్మిషన్లు కల్పించారని సంధ్య గుర్తుచేశారు. నర్సింగ్ చదివే 11 విద్యార్థినులపట్ల లైంగిక వేధింపులకు గురిచేశారని, ఇదే విషయాన్ని తాము హోంమంత్రి నాయినికి ఫిర్యాదు చేశామని వివరించారు. ప్రైవేటు హాస్టల్స్‌లలో ఉన్న శాంకరీ విద్యార్థినుల వద్దకు వెళ్లి వేధింపులకు గురిచేసే వారని, గతంలోనూ ఆయనపై లైంగిక ఆరోపణలు వచ్చాయని చెప్పారు.

Comments

comments