Home జాతీయ వార్తలు శ్రీనగర్‌లో డిఎస్‌పిని కొట్టి చంపిన అల్లరిమూక

శ్రీనగర్‌లో డిఎస్‌పిని కొట్టి చంపిన అల్లరిమూక

DSP-Killedశ్రీనగర్ : విధి నిర్వహణలో ఉన్న ఒక డిఎస్‌పిని ఇక్కడ కొం దరు అల్లరి మూక బట్టలు రాళ్లతో కొట్టి చంపారు. స్థానికంగా కలకలం రేపిన ఈ దారుణ ఘటనను అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించారు. డిఎస్‌పి మహ్మద్ ఆయూబ్ పండిట్ పాత శ్రీనగర్‌లోని నౌహట్టలో ఉన్న చారి త్రక జామియా మసీదు వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. గురు వారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో కొంతమంది అల్లరి మూక ఆయన్ను బట్టలు ఊడదీసి రాళ్లతో కొట్టి అతి దారుణంగా హతమార్చారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత మసీదు నుండి బయటకు వస్తున్న వ్యక్తుల ఫొటోలను తీశారన్న నెపంతో ఆయన్ను దారుణంగా కొట్టి చంపారు. తనపై అల్లరిమూక దాడులకు దిగిన సమయంలో డిఎస్‌పి పండిట్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్పులు జరపడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రార్థనల సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పండిట్‌ను మసీదు బయట భద్రతా విధుల్లో నియమించామని, అయితే మసీదు నుండి బయటకు వచ్చిన వారే కొందరు ఈ పనికి పూనుకున్నారని డిజిపి ఎస్‌పి వాయిద్ చెప్పారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని ఆయన పేర్కొన్నారు. మసీదు యాక్సెస్ కంట్రోల్‌ని తనిఖీ చేసి బయటకు వస్తున్న సమయంలో పండిట్‌ను కొంతమంది వ్యక్తులు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆయనపై దాడి చేశారని డిజిపి తెలిపారు. ఈ ఘటనను జమ్ము-కశ్మీర్ సిఎం మెహబూబా ముఫ్తీ, వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ సహా అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండిం చారు. ఈ ఘటన తలదించుకునే విధంగా ఉందని సిఎం అన్నారు. పోలీ సులు సహనం కోల్పోతే తీవ్రమైన ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తుందని ఆమె ఈ సందర్భంగా హింసంకు పాల్పడే వారిని హెచ్చరించారు. తమ విలువలకు, మతానికి విరుద్ధమైన ఘటనిది అని మిర్వాయిజ్
ఇద్దరు వ్యక్తుల అరెస్టు : డిఎస్‌పి పండిట్‌ని కొట్టిచంపిన ఘటనకి సంబం ధించి శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా మని, మరో వ్యక్తిని కూడా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితు లంతా చ ట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సిందేనని డిజిపి వాయిద్ విలేక రులకు తెలిపారు. శ్రీనగర్‌లోని జిల్లా పోలీసు లైన్స్ వద్ద డీఎస్పీ పార్థివ దేహానికి పూలమాలలు వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఖండన: డిఎస్‌పి పండిట్‌ని అల్లరిమూక దారుణంగా కొట్టిచంపడాన్ని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఖండించారు.