Home బిజినెస్ బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.499లకే ‘డిటెల్’ ఫోన్

బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.499లకే ‘డిటెల్’ ఫోన్

bsnl

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ అత్యంత చౌకైన ఫోన్‌ను అందిస్తోంది. దీనికోసం మొబైల్ తయారీ సంస్థ డిటెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రూ.499కే అత్యంత చవకగా మొబైల్‌ను అందించనున్నట్టు బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. బిఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ఫోన్‌తో పాటు ఆఫర్‌ను అందిస్తోంది. వినియోగదారుడు రూ.499కే డిటెల్ జి1 మొబైల్, బిఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ పొందవచ్చు. వ్యాలిడిటీ 365 రోజులు, అలాగే రూ.103 టాక్‌టైమ్ లభిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి బిఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రతి నిమిషానికి 15 పైసలు, బిఎస్‌ఎన్‌ఎల్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 40 పైసలు కాల్‌రేట్‌గా నిర్ణయించారు. వినియోగదారుడికి ఉచితంగా 28 రోజుల వరకు రింగ్‌బ్యాక్ టోన్ సౌకర్యం కల్పించారు. డి1 మొబైల్ ఫీచర్లు.. 1.44 అంగుళాల తెర, సింగిల్ సిమ్,అలాగే టార్చ్‌లైట్, ఫోన్‌బుక్, ఎఫ్‌ఎం రేడియో, స్పీకర్, వైబ్రేషన్ మోడ్, 650 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థం వుంటాయి. జియో ఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తర్వాత ప్రత్యర్థి కంపెనీలు కూడా ఆఫర్లను అందివ్వడంతో పాటు  ధరకే ఫోన్‌లను అందిస్తున్నాయి.