Home దునియా గాత్రదానం అమోఘం

గాత్రదానం అమోఘం

Voice

సినిమా, యాడ్, సీరియళ్లలో కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్ వింటుంటే మధురంగా ఉంటుంది. ఇంతచక్కని గొంతు వున్న వీరి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండటం సహజం. మనకు బాగా పరిచయమున్న కొంతమంది వాయిస్ గురించి తెలుసుకుందాం..

మల్టీటాలెంటెడ్ కృష్ణవేణి

లక్ష్మీ గణపతీ ఫిలింస్ ‘దయ్యాల కోటభూతాల దిబ్బ’ అంటూ సినిమా చూడకముందే అందరినీ భయపెట్టే వాయిస్ మనందరికీ పరిచయమే. కళాశాల ఫలితాలు వచ్చాయంటే చాలు టివిల్లో ప్రకటనల హోరు  జోరందుకుంటుంది…నారాయణ నెంబర్‌వన్ అంటేనే నారాయణ..నారాయణ తరువాతే ఎవరైనా…ఇలా స్పష్టంగా ఓ ఆడ గొంతు వినిపిస్తుంటుంది. ఆమే కృష్ణవేణి శఠగోపన్. కృష్ణవేణి డబ్బింగ్  చెప్పడంతోపాటు రైటర్, పర్సనల్ వాయిస్ లెండర్. ఘర్షణ, నీలో నాలో సినిమాలకు, హరహర మహదేవ, ఆర్‌కెఆర్‌కే మీడియా రాఘవేం ద్రరావు గారి ప్రొడక్షన్ మీడియా వాళ్ల సీరియల్స్‌కి, ఈటివికి సంబంధించి అన్ని సీరియల్స్‌కి  డైలాగ్స్ రాసింది. ఇప్పుడు టీవిలో సుబ్రహ్మణ్య చరితం సీరియల్‌కి, జెమినిలో  జై వినాయకకి సంభాషణలు రాస్తోంది. ఆ సీరియల్స్‌లో మేజర్ క్యారెక్టర్స్‌కి వాయిస్ డబ్బింగ్ ఇస్తోంది.  కమర్షియల్ అడ్వర్‌టైజ్ మెంట్స్, కాలేజీ ఇన్‌స్టిట్యూషన్స్ ఎడ్వర్‌టైజ్‌మెంట్స్‌కి వాయిస్ ఇస్తోంది. కమర్షియల్ యాడ్స్‌కి కూడా డబ్బింగ్ చెపుతోంది. ఈటీవీలో తీర్థయాత్ర,సుఖీభవ యాడ్‌కి వాయిస్ అందిస్తోంది.  వాయిస్ ఆఫ్ ఆర్టిస్ట్,  ఫ్రీ లాన్సర్‌గా కూడా సేవలనందిస్తోంది.  తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో పట్టు ఉందీమెకు. అన్ని భాషల్లో ట్రాన్స్‌లేషన్ వర్క్  చేస్తోంది.  మూవీ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆదిశంకరాచార్యలో జూనియర్ ఆదిశంకరాచార్యకు యంగ్ క్యారెక్టర్‌గా, మహాలక్ష్మి సినిమాలో   సీనియర్ సుహాసినికి వాయిస్ ఇచ్చింది. సినిమాలలో ఉన్న క్యారెక్టర్స్‌ని బట్టి తన గొంతును మారుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కన్నడలో 15 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.   ఘటోత్కచుడులో శశిరేఖకి, ఘట్టు అనే  ఏనుగుకి డబ్బింగ్ చెప్పినప్పుడు సింగీతం శ్రీనివాసరావు  చాలా మెచ్చుకున్నారుట. ఆయన ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ నాకు అవార్డు వచ్చినంత సంతోషంగా ఉందని కృష్ణవేణి  ఎంతో ఆనందంగా చెబుతోంది.

విలన్స్ పాపులారిటీ వెనుక.. రాజు 

రక్తచరిత్రలోని ఓ డైలాగ్ ‘ఈ ఏరియా ఒకప్పుడు పెద్ద అడవిలా ఉండేదట పులులు, తోడేళ్లు  ఇంకా చాలా జంతువులు తిరిగేవంట’ అని, శ్రీమంతుడి సినిమాలోని  ‘ఊరికే మాట్లాడి వెళ్లిపోవటానికి ఇది ఢిల్లీ అనుకుంటున్నావా? దేవర కోట దేవరకోటలో మామిడితోట  ఇక్కడికి రావడమే కాని వెళ్లడమంటూ ఉండదు’ అనే డైలాగులు ఎంత పాపులర్ అయ్యాయో తెలుసుగా..ఆ సినిమాల్లోని పాత్రలకు తెరవెనుక గాత్రదానం చేసింది ఆర్‌సిఎం రాజు.  1997 నుండి ఇప్పటి వరకు దాదాపు 1000 సినిమాల వరకు, 100 సీరియల్స్ వరకు డబ్బింగ్ ఆర్టిస్టుగా  పనిచేశాడు రాజు.  నంది అవార్డులు పొందాడు.  మిమిక్రీ రంగం నుండి రావడం మూలాన చాలా మంది హీరోలకి ట్రాక్స్ కూడా చాలా సునాయాసంగా అందించాడు.  ‘ఏం మనవుడా ఎలా వున్నారు? నా తెలుగింటి ఆడపడుచులు, తమ్ముళ్ళంతా అది వారి అభిమానం అని’  విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకి రాజమౌళి యమదొంగలో ఇచ్చిన డైలాగ్  చాలా ఫేమస్ అయింది.  ఆయనకు ఇష్టమైన, మంచి పేరు తెచ్చిన సినిమా ‘రక్తకన్నీరు’లో ఉపేంద్రకి  చెప్పిన డబ్బింగ్. హీరో చెప్పిన  మరో డైలాగ్ “అమెరికన్ డాలర్స్ మలేషియన్ రింగిడ్స్‌తో విలాస కులాసాలాడిన ఈ మదనమోహనుణ్ణి రెండే నిముషాల్లో రంజింపచేసిన నీ అందం ఏ దేశంలో మాన్యుఫాక్చర్ అయిందంటే నమ్మశక్యంగా లేదు. బ్యూటీ  వాట్ ఈజ్ యువర్ గుడ్ నేప్ ప్లీజ్  ఆన్ కమ్‌” అని డైలాగ్ అంటే రాజుకు చాలా ఇష్టమట. ఆశిష్ ప్రదీప్‌రావత్, ముఖేష్ రుషి,  నాజర్, సుమన్‌లకు వాయిస్ అందిస్తుంటాడు రాజు.

రిలీజ్ ఫంక్షన్స్‌లో మహేష్ వాయిస్ ఉండాల్సిందే..

మహేష్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రేడియో జాకీగా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు ఒక 500 మూవీస్‌కి ఆడియో రిలీజ్ ఏవీస్‌కి వాయిస్‌ఓవర్ చెప్పాడు. యాడ్స్‌కి, రీసెంట్‌గా ఎన్నో మూవీస్‌లో విలన్స్‌కి గాత్రదానం చేశాడు. ప్రతి నిత్యం వినిపించే జనరల్ యాడ్స్ కొన్ని ‘సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు విజయవాడ’ అని, అలాగే ‘కంచిపట్టు చీరల కల్యాణ వస్త్ర ప్రపంచం భద్రకాళీ సిల్క్, ‘జిఆర్‌టి జ్యూయలర్స్ స్వచ్ఛమైన స్వర్ణాభరణాలకు సరికొత్త చిరునామా’ యాడ్స్‌కి వాయిస్ ఇచ్చాడు. మామా మహేష్‌కి ‘ట్రిపుల్ ఎక్స్ డిటర్జంట్ సోప్ ఇది సంస్కారవంతమైన సోప్’ యాడ్ పేరు తెచ్చింది. ‘జై లవకుశ’ సినిమాలో అభిమన్యు సింగ్‌కి చెప్పిన మీరు దేవుడిలా పూజించే ఆ రావణాసురుడిని నేను ఏం చేయాలి, ఆ రావణాసురుడిని చంపేస్తాను.., అలాగే షేర్ అనే మూవీలో ముఖేష్‌రుషికి ‘చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అలాగే చెడు చూడవద్దు అని మీ అమ్మ నీకు చెప్పలేదా’ అనే డైలాగ్ ఎక్కువ ఫేమస్ అయ్యాయి. ఈటీవీ ప్లస్ ఆన్ చేయగానే మనకి వినిపించే ‘ఈటీవీ ప్లస్ మస్త్ టైమ్‌పాస్’, ‘పఠాస్’, ‘సినిమా చూపిస్త మామ’ అనే డైలాగులు మహేష్ చేసినవే. మాటివి, వి సిక్స్, టి న్యూస్, ఏడెనిమిది ఛానల్స్‌లో ప్రతిరోజూ ప్రోమోస్‌తో చెపుతుంటాడు. కోటిదీపోత్సవం ప్రోమోస్ కూడా ఇతను చెప్పినవే. ఘాజీ మూవీలో పాకిస్థానీ కమాండర్ రజాక్ చెప్పిన పాపులర్ డైలాగ్ ‘పైకి కిందికి, పైకికిందికి, వాడు కమాండారా?లిఫ్ట్ మానా?’ అనేది తనకు మంచి పేరు తెచ్చిందని చెబుతుంటాతడు మహేష్.