Search
Friday 21 September 2018
  • :
  • :

పంజాబ్‌లో రీపోలింగ్

Punjab-Pollingన్యూఢిల్లీ : పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 48 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ అదేశించింది. ఫిబ్రవరి 9 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ రీపోలింగ్ జరుగనుంది. ఇవిఎంలలో తలెత్తిన అంతరాయం కారణంగా ఈ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అమృత్‌సర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 16, మజిథా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 12, మోఘా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1, ముక్తసర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 9, సర్దుల్‌ఘర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 6 పోలీంగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.

Comments

comments