Home జాతీయ వార్తలు సారీ నో క్యాష్

సారీ నో క్యాష్

atm

దేశమంతటా ఎటిఎమ్ లు ఖాళీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరెన్సీ నోట్ల కరువు ఏర్పడింది. ఏ బ్యాంక్ ఎటిఎంకు వెళ్లినా ఎన్ని సార్లు కార్డు అరగతీసినా క్యాష్ లేదు బాబూ అనే సంకేతాలు కన్పిస్తున్నాయి.దీంతో ఖాతాలలో డబ్బులు న్నా జేబులలోకి అవి రాని సంకట స్థితి లో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఈ కరెన్సీ కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అనే తేడా లేకుండా అన్ని బ్యాంకులు ఇదే దుస్థితిలో పడటం తో, అసలు ఎటిఎంలు ఎందుకు దండగా అనే నిట్టూర్పులు వెలువడుతున్నాయి. చీ మ చీమ ఎందుకు కుట్టావంటే అనే రీతి లో ఇప్పుడు ఈ నోట్ల కటకటకు మోడీ తీసుకువచ్చిన నోట్ల రద్దే కారణం అని అంతా భావిస్తున్నారు. తమ కు సరిపడా నగదు రావడం లేదు కాబ ట్టి అనుబంధ ఎటిఎంలలో నిల్వలు పెట్టలేకపోతున్నామని అధికారులు చెపుతున్నారు.

దీనితో అసలు బ్యాం కింగ్ వ్యవస్థపైనే నమ్మకా లు ఆవిరి అవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాలలో కొంతలో కొంత నగదు కొరత లేదని, అదే ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి మరీ దయనీయంగా ఉందని వ్యాపారులు వాపోతున్నారు. ఒక బ్యాంక్ ఎటిఎం కార్డులున్న వారు సంబంధిత బ్యాంకుల ఎటిఎంలలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లితే అందులో నిల్వలు లేవనే సమాధానం వస్తోంది. దీనితో లావాదేవీలకు రుసుంలు తీసుకునే ఇతర బ్యాంకుల ఎటిఎంల నుంచి డబ్బులు తీసుకుంటే ఫోన్ల ద్వారా తాఖీదుల సందేశాలు అందుతున్నాయి. ఇతర బ్యాంకుల ఎటిఎంల జోలికి ఎందుకు వెళ్లారు? ఈ విధంగా ఎక్కువ సార్లు వెళ్లితే ఇంతేసంగతులు అనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. దీనితో ఖాతాదారులు అమ్మ పెట్టదు అడుక్కుతిననివ్వదనే వేదాంతంలో పడిపోతున్నారు. కొద్ది నెలలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని బ్యాంకులు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా నగ దు అరువు తెచ్చుకుంటున్నాయి.

తెలంగాణకు రెండు నెలల నుంచి మహారాష్ట్ర, కేరళల నుంచి నగదు అందుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఒడి శా, తమిళనాడు నుంచి నగదు వస్తోంది. ఆర్‌బిఐ అనుమతితో ఇతర రాష్ట్రాల నుంచి నగదు తీసుకువస్తున్నామని, అయితే ఈ నెలలో ఇప్పటివరకూ డబ్బు రాలేదని దీనితో ఎటిఎంలు వట్టిపోతున్నాయని ఒక బ్యాంకు అధికారి వివరణ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు కొరత తీవ్రస్థాయికి చేరింది. జనవరి నుంచి ఇది మరింతి ముదిరిందని అధికారులు తెలిపారు. ఆర్‌బిఐ వారు చాలా రోజులుగా రెండు వేల కరెన్సీ నోట్లను సరఫరా చేయడం లేదు. ఆర్‌బిఐ నుంచి డబ్బు రావడం లేదు. తగు విధంగా కస్టమర్ల నుంచి ఖాతాలలోకి నగదు జమ కావడం లేదు. దీనితో నగదు కొరత తీవ్రస్థాయికి చేరింది.చాలా చోట్ల ఎటిఎంలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల అవి పేరుకు పనిచేసినా డబ్బులు రాల్చక బావురు మంటున్నాయి.

పలు చోట్ల ఎటిఎంలు శిథిల గృహాలుగా మారుతున్నాయి. ఇంతకు ముందు వేతనాలు రాగానే ఉద్యోగులలో అత్యధికులు కేవలం తక్షణ ఖర్చులకు డబ్బు తీసుకుని మిగిలిన మొత్తం ఖాతాలలోనే నిల్వ చేసుకుని ఎప్పటికైనా పనికి వచ్చే ఎటిఎం ఉంది కదా? ఏ రాత్రి అయినా నగదు తీసుకోవచ్చుననే దీమాలో ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎటిఎంల మూగనోముతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో అత్యధికులు ఇప్పుడు మొత్తం డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకుంటున్నారు. ఈ విధంగా తాము పూర్తి స్థాయిలో బ్యాంకులతో అనుసంధానం కాలేకపోతున్నట్లు వినియోగదారులు తెలిపారు. ఓ వైపు ఆధార్ ఇతర అనుసంధాన ప్రక్రియలతో బ్యాంకుల వారు ఖాతాదారులను కావిలించుకున్నంత పని చేస్తుండగా మరో వైపు చేతులెత్తేస్తున్న ఎటిఎంలతో చీదరణకు గురి అవుతున్న పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు.