Home మంచిర్యాల బల్దియాలను పీడిస్తున్న మొండి బకాయిలు

బల్దియాలను పీడిస్తున్న మొండి బకాయిలు

mandal

* అధికార నేతల ఒత్తిడితో ముందుకు కదలని అధికారి
*మూడు మున్సిపాలిటీల్లో రూ. 5.89 కోట్లు
*వసూళ్లపై శ్రద్ద చూపని అధికారులు
*బల్దియాల్లో కుంటు పడుతున్న అభివృద్ధి పనులు
*బిల్లులు చెల్లించకపోవడంతో ముందుకు రాని
కాంట్రాక్టర్లు

మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: జిల్లాలోని మున్సిపాలిటీలను మొండి బకాయిలు పీడిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడి కార ణంగా అధికారులు బకాయిల వసూళ్లవైపు  ముందుకు సాగడం లేదు. ఫలితంగా పట్టణాల్లో అభివృద్ధి పనులు  కుంటు పడుతున్నాయి. పన్ను లు వసూలు కాక  బిల్లులు చెల్లించకపోవడంతో అభివృద్ధి పనులు చే పట్టేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు.  కేవలం పట్టణాల్లో  పన్నుల వసూళ్ల కోసం ఆటో రిక్షాలో ప్రచారం చేయడం తప్పా అధికారులు శ్రద్ద చూపడంలేదని, ఆరోపణలు ఉన్నాయి. 2017  18 సంవత్సరం మార్చి31 నాటికి మంచిర్యాల బెల్లంపల్లి మందమర్రి మున్సిపాలిటీలలో రూ.5.89కోట్ల ఇంటి పన్నులు ప్రభుత్వ కార్యాల యాల  భవనాల పన్నులు నల్ల బిల్లు బకాయిలు రావాల్సి ఉండగా  అధి కారులు వసూలు చేయకపోవడంతో అభివృద్ధి పనులు   ఆగిపోయాయి.  మంచిర్యాల మున్సిపలిటీలో  రూ.8.55 కోట్లు పన్నులు ఉండగా  ఇందులో 7.05 కోట్లు వసూలు కాగా 1.50 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో  రూ.1.40 కోట్ల బకాయిలు లక్షం కాగా ఇప్పటి వరకు 17.86 లక్షల బకాయిలు ఉన్నాయి. మందమర్రి మున్సిపాలిటీలో రూ. 82.28 లక్షలు బకాయిలు ఉండగా 71.50 లక్షలు వసూలు కాగా  11.78 లక్షలు  వసూలు కావాల్సి ఉంది. మంచిర్యాల మున్సిపాలిటీలో  21 వేల నివాస, వాణిజ్య గృహాలు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి  పాత బకాయిలు కలుపుకొని, రూ. 8.55కోట్లు ఇంటి పన్నులు రావాల్సి ఉండగా  అధికారులు 82.43 శాతం వసూలు చేశారు. పట్టణంలోని 101 ప్రభుత్వ కార్యాలయాల భవనాల నుంచి రూ.99.71లక్షల పన్నుల రూపంలో రావాల్సి ఉండా రూ. 46 వేలు మాత్రమే వసూలు చేయగా 99.25 లక్షల బకాయిలు  అదే విధంగా ఉన్నాయి.  మందమర్రి మున్సిపాలిటీలో 13.680 నివాస, వాణిజ్య గృహాలు ఉండగా వీటి ద్వారా ప్రతి సంవత్సరం 82.28 లక్షల ఇంటి పన్నులు రావాల్సి ఉండగా అధికారులు  నిర్లక్షం చేస్తున్నారు. దాదాపు 3200 ప్రభుత్వ కార్యాలయాలు సింగరేణి క్వార్టర్ల నుంచి  రూ.17 లక్షల బకాయిలు ఉన్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో 10.95 నివాస వాణిజ్య గృహాలు  ఉండగా వీటిలో 97. 28 శాతం పన్నులు వసూలు చేశారు. పట్టణంలోని 4120 సింగరేణి క్వార్టర్లు , ప్రభుత్వ కార్యాలయల భవనాల నుంచి రూ. 61.07 లక్షల పన్నులు రావాల్సి ఉండగా ఉండగా ఇందులో రూ. 22.75 లక్షలు వసూలు కాగా  మరో  రూ.38.32 లక్షల బకాయిలు వసూలు  కావాల్సి ఉంది. జిల్లాలోని మున్సిపాలిటీలలో నల్ల బిల్లు బకాయిలు  వసూలు చేయడంతో సైతం అధికారులు నిర్లక్షం చేస్తున్నారు.  ఫలితంగా మూడు మున్సిపాలిటీలలో బకాయిలు పేరుకుపోగా ప్రజలకు సరిపడగా తాగు నీరు సరఫరా చేయడం లేదు. మంచిర్యాల పట్టణంలో 13.100 నల్ల కనెక్షన్‌లు ఉండగా  మందమర్రి 545 కనెక్షన్లు ఉన్నాయి.  బెల్లంపల్లిలో 2500 నల్ల  కనెక్షన్ ఉండగా దాదాపు  2.71 కోట్ల నల్లా బిల్లులు వసూలు చేయాల్సిండగా  అధికారులు పట్టించుకోవడం లేదు.  ఈనెలాఖర్‌లోగా మొండి బకాయిలను వసూలు చేయాలని  అధికారులు ముందుకు సాగుతున్నారు.