Home బిజినెస్ మొండి బకాయిల పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు!

మొండి బకాయిల పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు!

  • రాబట్టుకునే  ఆశలింకా ఉన్నాయి : ఎస్‌బిఐ

Arudati-Bhattacharya

యోకోహామా(జపాన్): భారత్‌లో ఉన్న మొండి బకాయిలు చాలా వరకు పరిశ్రమలకు సంబంధిం చినవేనని, ఆ పరిశ్రమలు ఇంకా పనిచేస్తూనే ఉన్నా యని, అవి మళ్లీ గాడిలో పడినప్పుడు వాటి బకా యిలను బ్యాంకులు రాబట్టుకుంటాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) శనివారం తెలి పింది. ఇక్కడ ఏర్పాటైన ‘సవాళ్ల కాలంలో ఆసియా బ్యాంకులు’ అన్న సెమినార్‌లో ఎస్‌బిఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య ప్రసంగిస్తూ రుణాలు మొం డి బకాయిలుగా మారడానికి కారణం అవి వడ్డీలు సైతం కట్టలేనంతగా సంపాదించలేకపోవడమేనని అన్నారు. ఖర్చులు పెరిగిపోవడం, ఎక్కువ కాలమై పోవడం.. ఇలాంటివన్నీ బకాయిలు పెరిగిపోడా నికి కారణమయ్యాయని ఆమె అన్నారు.క్రెడిట్ సూ యిస్సే ప్రకారం రుణాల్లో 16.6 శాతం రుణా లు కార్పొరేట్లకు సంబంధించినవే, అవి స్థూల జాతీ యోత్పత్తి(జిడిపి)లో దాదాపు 8.4 శాతం ఉండ గలవు, వాటిని నిరర్ధకాలుగా ప్రకటించడం జరిగిం ది. మొండి బకాయిల కారణంగా బ్యాంకు లకు రావలసిన బకాయిలు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల మేరకు ఉండగలవు. కంపెనీలకు పున ర్వవ్యస్థీకరించిన అప్పులు, అడ్వాన్సులు సేవల బాధ్యతలను నిర్వర్తించలేవు. రుణ ఎగవేతదారు లకు వ్యతిరేకంగా బ్యాంకులు చర్యలు చేపట్టా లని భారత రిజర్వు బ్యాంకు ఆదేశించేలా ప్రభుత్వం చట్ట సవరణను శుక్రవారం చేసింది. ‘నాకింకా దేశంలోని శక్తిపై నమ్మకం ఉంది. నిరర్ధక రుణా లు(ఎన్‌పిఎల్) విషయానికొస్తే ఇంకా చాలా వరకు నిరర్ధక ఆస్తులు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి’ అని అరుంధతి భట్టాచార్య సెమినార్‌లో చెప్పారు. ఆసియా అభివృద్ది బ్యాంకు వార్షిక సమావేశం జరుగుతున్న తరుణంలోనే జరిగిన ఈ సెమినార్ లో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. నిరర్ధక రుణా లను గాడిలో పెట్టాల్సి ఉందన్నారు. ‘మా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ అభివృద్ధిలోనే ఉంది. ఇంకా సక్ర మంగా నడపాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే ఇప్పుడు నిరర్ధకంగా ఉన్న పరి శ్రమలు మళ్లీ పుం జుకుని తమ బకాయిలను తగ్గిం చేసుకుంటాయి. ఏదో ఒక సమయంలో మేము కూడా మా రుణాలు రాబట్టుకుంటాం’అని ఆమె అన్నారు. కార్పొరేట్ అత్యధిక అప్పుల విషయంలో ప్రస్తు తం భారతీయ బ్యాంకుల రంగం ఎదురీదుతోందని, కఠిన నియం త్రణలను అమలుచేయాల్సిన అవసరం కూడా ఉందని అరుంధతి భట్టాచార్య చెప్పారు. వనరులు వృథా కాకుండా మొండి బకాయిల పరిస్థితిని ఎలా సరిచేయాలన్నదే ప్రస్తుతం రెగ్యు లేటర్ల ముందున్న పెద్ద సవాలు అని ఆమె తెలిపారు.