Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్‌లో అడుగుపెట్టిన దుల్కర్

dlquer

సౌత్‌లో ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా బాలీవుడ్‌లో మూవీ చేస్తే వచ్చే గుర్తింపే వేరు. బాహుబలి చిత్రం ద్వారా ప్రభాస్‌కు వచ్చిన పేరును దీనికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ప్రవేశించి అక్కడ రాణించే ప్రయత్నంలో ఉన్నాడు మలయాళం సూపర్ స్టార్  మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్.  ఈ యంగ్ హీరో ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మైమరపించాడు. దుల్కర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈ యంగ్‌స్టార్ చేసిన మొదటి హిందీ సినిమా కార్వాన్. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 10న విడుదలకానుంది. ఇర్ఫాన్‌ఖాన్ ఇందులో కీలక పాత్రధారి. ఇందులో దుల్కర్‌కు జోడీగా మిథిలా పాల్కర్ నటించింది. సినిమాలో ఈ యంగ్ హీరో బెంగుళూర్‌లో నివసించే కుర్రాడిగా కనిపిస్తాడు. కామెడీ కాన్సెప్ట్‌తో ఎమోషనల్‌గా సినిమాను తెరకెక్కించామని దర్శకుడు ఆకర్ష్ ఖురానా చెప్పాడు. ఇప్పటికే మలయాళం, తెలుగు, తమిళ్‌లో సత్తా చాటిన దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంతో బాలీవుడ్‌లో రాణించాలని ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో చూడాలి.

Comments

comments