Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కోహ్లీగా దుల్కర్‌…?

Dulquer Salmaan play Virat Kohli in The Zoya Factor?

ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యుతమ ఆటగాడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. క్రికెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం కోహ్లీ ప్రస్తుతం ఉన్న వరల్డ్ రికార్డులో చాలా వాటిని అధిగమించడమే కాకుండా కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ అక్కడ కూడా అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తున్నాడు. ఇదిలాఉండగా బాలీవుడ్ లో  అనుజా చౌహాన్‌ నవల ఆధారంగా ‘జో యా ఫ్యాక్టర్‌’ అనే చిత్రం  తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో మళయాలం సూపర్ స్టార్ మమ్ముటి కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌, రన్ మెషిన్ విరాట్‌ కోహ్లీ పాత్ర పోషించనున్నాడు. ఇక మూవీ కథ విషయానికొస్తే అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్‌ యువతి విధుల్లో భాగంగా ఓ సారి టీమిండియాను కలుసుకుంటుంది. ఆమె జట్టును కలవడం, ఆపై ఆ జట్టు ప్రపంచకప్ గెలవడం జరుగుతుంది. దీంతో ఆ యువతి భారత జట్టుకు లక్కీగా గర్ల్ గా మారిపోతుందట. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుందని సమాచారం. ఇక దుల్కర్ ఇప్పటికే బాలీవుడ్ లో కార్వాన్ అనే మూవీతో అరంగేట్రం చేశాడు. ఈ సినిమా తర్వాత దుల్కర్ చేస్తున్న రెండో చిత్రం ‘జో యా ఫ్యాక్టర్‌’. తెలుగులో ఇటీవల విడుదలైన ‘మహానటి’ మూవీతో దుల్కర్ సల్మాన్ మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో టాలీవుడ్ లోనూ ఆయనకు ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి.

Comments

comments