Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వ్యర్థ రసాయనాల డంపింగ్

chemicals in the mission bhagiratha pipe line

బౌరంపేట మిషన్ భగీరథ పైపులైన్లలో 

సంఘటనా స్థలిని అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు
దుండగులను కఠినంగా శిక్షించాలి

మన తెలంగాణ/షాపూర్‌నగర్: మేడ్చల్ జిల్లా కు త్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బౌరంపేట గ్రామం లో ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకొని మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పైపులైన్లలో గుర్తు తెలియని దుండుగులు ఇతర ప్రాంతాలను నుంచి తీసుకువచ్చిన కెమికల్ వ్యర్థ్ద రసాయానాలను భగీరథ పైపులైన్లపై పోసి వెళ్లిపోయారు. ఈ విషయం గమనించిన గ్రామస్థులు విషయాన్ని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజుకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్దలాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పిసిబి జేఈఏ రవీందర్‌రెడ్డిని ఘటనా స్దలానికి పిలిపించారు. భగీరథ పైపులైన్లలో పోసిన వ్యర్థ రసాయనాలు ఏ పరిశ్రమ నుంచి తీసుకువచ్చారో గుర్తించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై నిఘా ఉంచి తక్షణమే నిందితులను పట్టుకొని ప్రభుత్వ పథకాలకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దుండిగల్ పోలీసులకు, పిసిబి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పైపుల్లో వ్యర్థ రసాయనాలను పారపోసిన దుండగులను వెంటనే గుర్తించాలని పిసిబి అధికారులను  ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దుండిగల్ పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకార్‌రెడ్డి,సర్పంజ్‌లు కావలి గణేష్,అనంతస్వామి  పాల్గొన్నారు.

Comments

comments