Home జాతీయ వార్తలు మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై ఆత్యాచారం

మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై ఆత్యాచారం

RAPEటీ నగర్ : ప్లస్ టూ చదువుతున్న ఓ విద్యార్థినికి నకిలీ డాక్టర్ మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటన వాళప్పాడిలో సంచలనం సృష్టించింది. సేలం జిల్లా వాళప్పాడి సమీపంలో గల ఓలప్పాడికి చెందిన నవాబ్ (48) పెద్దనాయకన్ పాళయంలో నశీం ఫార్మసీ పేరిట మెడికల్ సెంటర్ నడువుతున్నాడు. ఈ దుకాణం లోపలే రోగులకు వైద్య చికిత్స చేస్తుంటాడు.
ఇతని మెడికల్ సెంటర్ సమీపంలో నివసిస్తున్న ప్లస్ టూ విద్యార్థినికి అనారోగ్యం ఏర్పడడంతో శనివారం రాత్రి నవాబ్ వద్దకు వైద్యనికి వెళ్లింది. ఆ సమయంలో విద్యార్థినికి నవాబ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో కొంత సేపట్లోనే విద్యార్థిని మత్తులోకి జారుకుంది. కొద్ది సేపట్లో మత్తు నుంచి తేరుకున్న విద్యార్థినికి నవాబ్ మందులు ఇచ్చి ఇంటికి పంపేశాడు. విద్యార్థిని ఇంటికి వెళ్లగానే ఒంట్లో నలగా ఉన్నట్లు గమనించింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు విచారణ జరపగా విద్యార్థినికి మత్తు మందు ఇచ్చి నవాబ్ అత్యాచారం చేసినట్లు తేలింది. ఆగ్రహించిన స్థానికులు నవాబ్‌పై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరిపి నవాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థినిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.