Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

నాజూకు అందాలతో మురిపిస్తోంది

mrn

అందాల తార మెహరీన్ కౌర్ గత ఏడాది అంతా వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని ఎంతగానో అలరించింది. 2017లో మహానుభావుడు చిత్రంతో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ‘జవాన్’ దాకా సాగింది. గత ఏడాది బిజీబిజీగా గడిపిన ఈ బ్యూటీ ప్రస్తుతం కొంచెం ఫ్రీ అయ్యిందట. దీంతో ఇప్పుడు తన ఫిజిక్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. జిమ్‌లో ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ తన ఫిజిక్‌ను అందంగా మలచుకుంటోందట. అందమైన తన శరీరాకృతితో ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ చేయించుకుంటోంది ఈ భామ. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానుల ముందుకు తీసుకువస్తూ వారిని మురిపిస్తోంది. తాజాగా ఈ భామ తన కొత్త ఫొటోను రిలీజ్  చేసి అందరినీ ఆకట్టుకుంది. లేత గులాబీ రంగు ఫ్రాక్‌లో క్లీవేజ్ అందాలతో బంగారు మేని ఛాయతో చూపుతిప్పుకోకుండా చేసింది మెహరీన్. ప్రస్తుతం ఈ అందాల సుందరి గోపీచంద్‌తో ‘పంతం’ సినిమాలో నటిస్తోంది.

Comments

comments